Sunday, May 11, 2025
Homeబీజినెస్వాట్సాప్‌లోనూ ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులు

వాట్సాప్‌లోనూ ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులు

- Advertisement -


న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఆన్‌లైన్‌ సేవలను మరింత విస్తరించింది. తాజాగా ప్రీమియం చెల్లింపులు మరింత సులభతరం చేయడానికి వీలుగా వాట్సాప్‌ బోట్‌ సేవలను ఆవిష్కరించింది. దీంతో పాలసీదారులు మరింత సౌకర్యంగా చెల్లింపులు జరిపేందుకు వీలుంటుందని ఎల్‌ఐసీ పేర్కొంది. పోర్టల్‌లో రిజిస్టర్‌ కస్టమర్‌ నుంచి 8976862090కి వాట్సప్‌ ద్వారా సమాచారం ఇస్తే ఆ పాలసీదారుడికి సంబంధించి మొత్తం వివరాలు వెంటనే రానున్నాయని ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ సిద్దార్థ మోహంతి తెలిపారు. ఇలా వచ్చిన వివరాల ఆధారంగా యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌, కార్డు ద్వారా ప్రీమియం చెల్లింపులు జరుపుకోవచ్చునన్నారు. దీంతో తమ బీమా ప్రీమియం చెల్లింపులు జరిపేందుకు మరో ప్రత్యామ్నాయం లభించినట్లయ్యిందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -