భారత స్టాక్‌మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వార్
న్యూఢిల్లీ : అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై సాగిస్తోన్న మారణకాండ భారత స్టాక్ మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ ప్రభావం దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసీకి గొడ్డలిపెట్టులా మారింది. ఆ సంస్థ పెట్టుబడులు వేల కోట్లలో ఆవిరైపోతున్నాయి. కేవలం పది రోజుల్లోనే ఎల్‌ఐసీ తన స్టాక్ పోర్ట్‌ఫోలియోలో రూ.70,105 కోట్ల సంపదను కోల్పోయింది. ఫిబ్రవరి 27న రూ.14.88 లక్షల కోట్లుగా ఉన్న ఉన్న ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ.. మార్చి 9 నాటికి 4.7 శాతం తగ్గి రూ.14.17 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి చెందిన ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల షేర్లు పతనం కావడంతో ఎల్‌ఐసీకి సుమారు రూ.15,293 కోట్ల నష్టం వాటిల్లింది. అదే విధంగా ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టర్బో షేర్ల పతనం వల్ల మరో రూ.7,609 కోట్ల సంపద ఆవిరయ్యింది.
ఎల్‌ఐసీకి రూ.70 వేల కోట్ల నష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



