Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ముగిసిన ఎల్ఐసి 69వ వారోత్సవాలు 

ముగిసిన ఎల్ఐసి 69వ వారోత్సవాలు 

- Advertisement -

గురువులకు, సీనియర్ ఏజెంట్ కు సన్మానాలు 
నవతెలంగాణ – రామారెడ్డి 

ప్రభుత్వ రంగ సంస్థ జీవిత బీమా (ఎల్ఐసి) 69వ వారోత్సవాలు జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో గురువారం ముగిశాయి. బ్రాంచ్ మేనేజర్ కృష్ణ మోహన్ అధ్యక్షతన వారం రోజుల నుండి వివిధ కార్యక్రమాల నిర్వహించి, చివరి రోజు డి వో లకు, అధికారులకు, సీనియర్ ఏజెంట్ కు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…. ఎల్ఐసి పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పై అంచలంచలుగా ఉద్యమాలు చేసి బీమాపై జీఎస్టీ ని కేంద్ర ప్రభుత్వం తొలగించడం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి దినదిన అభివృద్ధి చెందుతూ, ప్రజలకు సేవ చేస్తుందని , ప్రభుత్వానికి ఆర్థిక వనరుగా దేశ అభివృద్ధిలో ఎల్ఐసి ది కీలక పాత్ర అని అన్నారు. కార్యక్రమంలో ఎల్ఐసి అధికారులు శ్రీనివాసరావు, అనర్ధన్, డి వో లు వెంకటేశ్వర్లు, ఇక్బాల్ అహ్మద్, రంజిత్ రెడ్డి, వీరేశలింగం, నరేష్, లియఫి నాయకులు కిషోర్ చంద్, మోహన్ , బ్రాంచ్ అధ్యక్షులు కదం నారాయణరావు, కార్యదర్శి ప్రతీప్ జైన్, కోశాధికారి ఉమాపతి, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad