Monday, February 16, 2026
E-PAPER
Homeజాతీయంట్రేడ్‌డీల్‌లో వ్యవసాయంపై అబద్ధాలే

ట్రేడ్‌డీల్‌లో వ్యవసాయంపై అబద్ధాలే

- Advertisement -

పీయూశ్‌ గోయల్‌ రాజీనామా చేయాలి
గ్రామాల్లో ఆందోళనలకు ఏఐకేఎస్‌ పిలుపు


న్యూఢిల్లీ: అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం నుంచి వ్యవసాయాన్ని మినహాయించడం అబద్ధమని ముడి పత్తి దిగుమతిపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి చేసిన డిక్లరేషన్‌ వెల్లడించిందని ఏఐకేఎస్‌ పేర్కొంది. ‘అమెరికా నుంచి భారత్‌ ముడి పత్తిని కొనుగోలు చేస్తుంది. ఈ పత్తితో తయారైన వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులపై సున్నా శాతం పన్ను అమలవుతాయి’, ‘భారత్‌- అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం అమల్లోకి వచ్చినప్పుడు బంగ్లాదేశ్‌ మాదిరిగానే భారత్‌ కూడా రాయితీలు వర్తిసాయి’ అని మంత్రి డిక్లరేషన్‌ ప్రస్తావించడాన్ని ఏఐకేఎస్‌ గుర్తు చేసింది. ఈ మేరకు ఏఐకేఎస్‌ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. పీయూశ్‌ గోయల్‌ డిక్లరేషన్‌ పూర్తిగా రైతు వ్యతిరేకమైనది, దారుణమైనదని ఏఐకేఎస్‌ విమర్శించింది.

అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడం వల్ల ఇప్పటికే తక్కువగా ఉన్న దేశీయ పత్తి రేటు మరింతగా తగ్గుందని, మరింత సంక్షోభంలోకి వెళుతుందని, పత్తి వ్యవసాయం ఇబ్బందుల్లోకి వెళుతుందని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని ఏఐకేఎస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అత్యంత అధునిక యాంత్రిక పద్దతుల్లో సాగు చేసే, ప్రభుత్వ ప్రోత్సహం కలిగిన అమెరికా పత్తి రైతులకు అనుకూలంగానే పీయూశ్‌ గోయల్‌ డిక్లరేషన్‌ ఉందని ఏఐకేఎస్‌ విమర్శించింది. అలాగే, దేశీయ పారిశ్రామిక వేత్తలను కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకునేలా డిక్లరేషన్‌ ప్రొత్సహిస్తుందని తెలిపింది. మరోపైపు దేశీయ పత్తి రైతులు సాగు వ్యయం పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. అమెరికా పత్తి దిగుమతులతో దేశీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతినవని, దేశీయ పత్తి వినియోగంపై ప్రభావం చూపదనే వాదనలను ఏఐకేఎస్‌ ఖండించింది.

ఏషియన్‌-భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందంతో కేరళలోని రబ్బరు రైతులు తీవ్రంగా నష్టపోయినట్లే.. అమెరికా ఒప్పందంతో పత్తి రైతులు ఇబ్బందులు పడతారని, సాగును పూర్తిగా వదిలి వేయాల్సి వస్తోందని ఏఐకేఎస్‌ హెచ్చరించింది. ఇప్పటికే అంటే గతేడాది సెప్టెంబరు 30 నుంచి డిసెంబరు 31 వరకూ పత్తి దిగుమతిపై సుంకాలను కేంద్రం సున్నాకి తగ్గించిందని, ఈ సమయంలో అమెరికా దిగుమతులు 95 శాతం పెరిగాయని ఎఐకెఎస్‌ గుర్తు చేసింది. పత్తి దిగుమతులు పెరిగితే భారత రైతులు అమెరికా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల రైతులతో పోటీ పడలేరని తెలిపింది. ఇప్పటికే దేశంలో కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభం కారణంగా రైతుల ఆత్మహత్మలు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించింది. దేశీయ రైతులను మోసం చేస్తున్న పీయూశ్‌ గోయల్‌ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌ను ఏఐకేఎస్‌ పునరుద్ఘాటించింది. పత్తి పండించే గ్రామాల్లో ఉధృతంగా ప్రచారం చేయడం, పీయూశ్‌ గోయల్‌ ద్రోహానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని ఏఐకేఎస్‌ ఈ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -