Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంవిధుల్లో చేరిన లెఫ్టినెంట్‌ జనరల్‌ హార్పల్‌ సింగ్‌

విధుల్లో చేరిన లెఫ్టినెంట్‌ జనరల్‌ హార్పల్‌ సింగ్‌

- Advertisement -
  • మంత్రి ఉత్తమ్‌తో భేటీ
    నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
    తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల శాఖా సలహాదారుడిగా నియమితులైన లెఫ్టినెంట్‌ జెనరల్‌ కల్నల్‌ హార్పల్‌సింగ్‌ సోమవారం విధుల్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసేందుకు రూపొందించిన ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణ కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.అంతకు ముందు లెఫ్టినెంట్‌ జెనరల్‌ హార్పల్‌ సింగ్‌ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు అదిత్యా దాస్‌నాధ్‌, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్‌తో పాటు ఈఎన్సీలు అంజద్‌ హుస్సేన్‌, శ్రీనివాస్‌, రమేష్‌బాబును ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన లెఫ్టినెంట్‌ జెనరల్‌ హార్పల్‌సింగ్‌ టన్నెల్‌ నిర్మాణ రంగంలో అపార అనుభవం గడించిన దష్ట్యా ఆయన్ను ఈ శాఖలో నియమించిన విషయం విదితమే. ముఖ్యంగా మూడు లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ఫ్లోరోసిస్‌ బారిన పడిన నల్లగొండ జిల్లా ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో సర్కారు ఈ నియామకం చేసింది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం తవ్వకంలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ జెనరల్‌ హార్పల్‌సింగ్‌ అనుభవాన్ని వినియోగించుకు నేందుకు వీలుగా ఈ నియామకం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన కారణంగా, ఎస్‌ఎల్‌బీసీ పనులు పూర్తి చేసి త్వరితగతిన పూర్తి చేయాలని నియమించిన నేపథ్యంలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకీ తేనుంది. ఈ క్రమంలోనే సొరంగమార్గం తవ్వకాలలో అపార అనుభవం గడించిన హార్పల్‌ సింగ్‌ సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad