Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తుఫాన్‌ ప్రభావంతో స్తంభించిన జనజీవనం

తుఫాన్‌ ప్రభావంతో స్తంభించిన జనజీవనం

- Advertisement -

– మత్తడి దూకుతున్న పలు చెరువులు
– నిరంతర పర్యవేక్షణలో ఎస్ఐ, తహశీల్దార్ 
నవతెలంగాణ – రాయపర్తి
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్‌ ప్రభావంతో మండలంలోని ఈదురుగాలులు వీస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బలమైన ఈదురు గాలులతో నిర్విరామంగా వర్షం కురవడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సందర్భంగా ముత్యం రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు అవసరం మేరకే ఇండ్ల నుండి బయటకు రావాలని తెలిపారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో గ్రామాల్లో చెరువులు కుంటలు నిండుకుండలా ఉన్నాయని తుఫాన్ వర్షంతో ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటాయని చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. వాహనదారులు స్థానిక ప్రజలు మత్తడి వాగులు దాటే ప్రయత్నం చేయరాదు అన్నారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు గుంతలను గమనించుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించాలని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు టోల్ ఫ్రీ 100 నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -