జిల్లాకు రూ 9. లక్షలు మంజూరు
జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
నవతెలంగాణ – అచ్చంపేట
వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ ) పథకం జిల్లా స్థాయిలో వ్యవసాయ విస్తరణ సంస్కరణలను అమలు చేసే ఒక స్వయం ప్రతి గల రిజిస్టర్డ్ సొసైటీ. దీని ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక సాంకేతిక శిక్షణ వ్యవసాయ అనుబంధ రంగాలు పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్యశాఖ, ఇలా వ్యవసాయ అనుబంధ రంగాలలో నూతన సాగు సమాచారాన్ని రైతులకు అందిస్తూ సేవలు అందిస్తుంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి, అచ్చంపేట కొల్లాపూర్, నాగర్ కర్నూల్ వ్యవసాయ డివిజన్ కేంద్రాలు ఉన్నాయి. కల్వకుర్తి డివిజన్ తప్ప మిగత డివిజన్ లలో ఆత్మ కమిటీలు ఏర్పాటు చేశారు. త్వరలోనే కల్వకుర్తి జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. డివిజన్ పరిధిలో గల రైతులతో డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు ఉంటాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
జిల్లాల విభజన ల అనంతరం ప్రభుత్వం ఈ పథకానికి నిధులు కేటాయించడం మానుకుంది. దీంతో రైతులకు అవగాహన కార్యక్రమాలు, కిసాన్ మేళాలు కనుమరుగయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం 9, లక్షల 70,వేలు కేటాయించడంతో ఆత్మ పథకానికి జీవం పోసినట్లు అయిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జిల్లాలో రైతు మేళాలు, సేంద్రియ ఎరువుల వినియోగం నూతన సాగు పద్ధతుల పైన క్షేత్ర పర్యటనలు అమలు కారున్నాయి.
రైతులకు ప్రయోజనం జరుగుతుంది: యశ్వంత్ రావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
ఆత్మ పథకానికి ప్రభుత్వం రూ.9 లక్షల 70. వేలు కేటాయించింది. పశు పోషణ, ఉద్యానవన తాగు పద్ధతుల పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. నూతన సాగు పద్ధతులు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా రైతులు చైతన్యం పొందుతారు.



