భూపాలపల్లి బ్రాంచ్ మేనేజర్ నల్లపురి హరికృష్ణ
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : ప్రతి ఒక్కరికి కనీసం అవసరాలు అయినా కూడు గూడు గుడ్డతో పాటు జీవిత భీమా కూడా తప్పని సరి అని ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్సు భూపాలపల్లి బ్రాంచ్ మేనేజర్ ఎన్ హరికృష్ణ తెలిపారు. ఇటీవల ఆకస్మాత్తుగా కాటారం మండల కేంద్రానికి చెందిన ఎస్ కే సబ్దార్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. సబ్దార్ రూ.50వేల ప్రీమియంతో ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్సు లో స్మార్ట్ స్కాలర్ పాలసీ తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా సబ్దార్ భార్య సోనికి రూ.5 లక్షల జీవిత భీమా మొత్తాన్ని మంగళవారం అందజేసినట్లుగా తెలిపారు.
అంతే కాకుండా పాలసీ కొనసాగుతుందని, సబ్దరు చెల్లించవలసిన మిగిలిన 4 వాయిదాలు కూడా తమ కంపెనీ చెల్లించి మెట్యూరిటీ మొత్తం చివరికి ఇవ్వడం జరుగుతుందని మేనేజర్ హరికృష్ణ తెలిపారు. ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్సు లో చిల్డ్రన్ పాలసీలతో పాటు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, పెన్షన్, టర్మ్ ప్లాన్స్, ట్రెడిషనల్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరు తమ అవసరాలకు మేరకు జీవిత భీమా పాలసీ లను ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్సు ద్వారా పొందవలసిందిగా కోరారు. ఈ సందర్బంగా లైఫ్ మిత్ర గురువారెడ్డి మాట్లాడుతూ ..సబ్దార్ తనకేంతో ఆప్తుడని అన్నారు.
ఆయన మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. కుటుంబానికి భీమా సౌకర్యంతో ఆర్థిక భద్రత కల్పించినందుకు సంతోషిస్తుమన్నారు. ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ మేనేజర్స్ మాసు రమేష్, డోలి రామక్రిష్ణ, మల్లారపు మొండయ్య, కస్తూరి సాయికృష్ణ, బ్రాంచ్ లైఫ్ మిత్రలు గురువారెడ్డి, దేశిని శంకర్, బొడ్డు రాజబాబు, సుంకరి కుమార్, పబ్బ నాగరాజు, గోక విష్ణు వర్ధన్ పాల్గొన్నారు.
లైఫ్ ఇన్సూరెన్సు..జీవితానికి ఆధారమైన భీమా.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES