Sunday, July 27, 2025
E-PAPER
Homeప్రత్యేకంమత్తులో జీవితం చిత్తు.. ఆలోచించి తల ఎత్తు ..

మత్తులో జీవితం చిత్తు.. ఆలోచించి తల ఎత్తు ..

- Advertisement -

ఒకప్పుడు ఇతర ఇతర ప్రాంతాలల్లో నగరాలలో పట్టణాలలో గంజాయి విక్రయాలు బానిసైన యువకుల ప్రచారం, వార్తలు వింటే ఆశ్చర్యాన్ని గురి అయ్యేవాళ్ళం కానీ నేడు పట్టణాల నుండి పల్లెలకు, గల్లీలకు గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. మనకు తెలియకుండానే మన ఊరులో, గల్లిలో మన పక్కన ఉన్నవాళ్ల మనకు తెలియకుండానే వాడికి ఆకర్షితులై బానిసలుగా మిగిలిపోతున్నారు. ఇది ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి.

స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు, యువకులు గంజాయికి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న వార్తలు రోజు విస్తతంగా బయటకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ శాఖ గంజాయి మాదకద్రవ్యాలపై ఉక్కు పాదం మోపుతున్న దాడులు చేస్తున్నా, రోజు ఏదో ఒక ప్రాంతంలో గంజాయి, మాదకద్రవ్యాలు, చాక్లెట్స్‌ రూపంలో, పట్టుబడటం చర్చనియంశంగా మారుతున్నది. ఇతర రాష్ట్రాల నుండి గంజాయిని కొనుగోలు చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి, యువకులు, విక్రయిస్తూ పట్టుబడటం గంజాయికు బానిసలు కావటం, హత్యలు అత్యాచారాలు, ఘర్షణలకు, ఆత్మహత్యలకు పాల్పడటం సంచలనం కలిగిస్తున్నాయి. అనేక కుటుంబాల పిల్లలు వీటికి బలైపోయాయి బానిసలుగా తయారయ్యారు. ప్రమాద అంచున ప్రయాణం సాగుతోంది. తమ పిల్లలను ఈ మహమ్మారి ఎక్కడ వెంటాడుతుందో అని తల్లిదండ్రులు ఆందోళన ఉన్నారు. తల్లిదండ్రులు అప్రమత్తమై. విద్యార్థి యువకుల కదలికలను పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తులకు పెద్దముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు మాదక ద్రవ్యాల విషయంలో అవగాహన ఉండటం చాలా అవసరం. పిల్లలు తోటిపిల్లల ప్రభావానికి గురై దురలవాట్లకు, దుర్‌వ్యసనాలకుకు చేరువ అవుతుంటారు. మొదట వీటికి అలవాటు పడినవారు అక్కడితో ఆగకుండా ఆ మత్తులో ఎంతో ఆనందం ఉందంటూ తోటి పిల్లలకు చెబుతారు. దాంతో ఇతర పిల్లలు కూడా అదేదో కొత్తగా, ఆనందంగా ఉంటుందనే భావంతో, కుతూహలంతో ఈ అలవాటు వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. మద్యంతో వచ్చే మత్తుకంటే రెండింతలు ఎక్కువగా ఉంటుందని, అదో కొత్త కిక్కు అంటూ… అంతకుముందే అలవాటు న్నవారు కొత్తవారిని అటువైపు తీసుకెళ్తుంటారు. అందుకే పిల్లలు కొత్తవారితో స్నేహం చేస్తున్నా, ఇంట్లోంచి డబ్బు తీసుకుని వెళుతున్నా తల్లిదండ్రులు గమనించాలి. వారు డబ్బుని ఏం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారో, ఎక్కడ ఉంటున్నారో గమనించాలి. గంజాయికి అలవాటుపడిన వారు మిగతావారితో పోలిస్తే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తారు. వారి ప్రవర్తన ఇంట్లో కూడా గుర్తించదగిన స్థాయిలో ఆ ప్రభావం ఉంటుంది. ఒంటరిగా ఉండడం, గంటల తరబడి గదిలోపలే ఉండడం, ఆలస్యంగా ఇంటికి రావడం, నిద్రపోవడం, ఆలస్యంగా లేవడం, మాట్లాడే మాటల్లో మార్పు, నేరుగా కళ్లలోకి చూడకుండా పక్కలకు చూస్తూ మాట్లాడడం లాంటివి పిల్లల్లో కనబడితే తల్లితండ్రులు వెంటనే అప్రమత్తం కావాలి. తగిన జాగ్రత్తలు తీసుకొని కౌన్సిలింగ్‌ ద్వారా మార్పుకు ప్రయత్నించాలి. సాధారణంగా జీవితంలో ఏదైనా ఒత్తిడికి గురయినప్పుడు, ఒంటరి తనాన్ని ఫీలవుతున్నపుడు పిల్లలు మత్తుకి బానిసలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు, ప్రేమలో విఫలమైనా, కుటుంబంలో ఏవైనా గొడవలు జరిగినప్పుడు యువతీయువకులు వీటివైపు మొగ్గుచూపే అవకాశం ఉన్నది.

గంజాయిని వాడేవారి మిగతావారికి కంటే భిన్నంగా, ఉంటారు. మాట్లాడేటప్పుడు కాస్త తడబాటు, మనషిలో మార్పుగా ఉంటారు. ఫ్రెండ్షిప్‌లో . గొడవలకు ప్రాధాన్యతిస్తుంటారు గతంతో పోలిస్తే పాకెట్‌ మనీ ఎక్కువ కావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తుంటారు. సమాజంలో చెడు వ్యసనాలను ప్రోత్సహించే ధోరణి పెరుగుతున్నది. మద్యం సేవించడం అలవాటు లేనివారిని చిన్నచూపు చూసే విధంగా సమాజం మారుతున్నది. చెడు అలవాట్లను ఫ్యాషన్‌గా, ఆధునికతగా భావిస్తున్నారు. పిల్లల నడవడిక, వారి అలవాట్లు, స్నేహాలు, చదువు మొదలైన వాటిని దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత తల్లిదండ్రులదే. అయితే నేటి తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతున్నది. బాధ్యతలు పెరిగిపోయాయి. కూలినాలి చేసుకునే తల్లిదండ్రులు ఉదయాన్నే వెళ్లిపోయి రాత్రికి వస్తున్నారు. ఉద్యోగాలు చేసే వారు వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉంటున్నారు. కొంతమంది చిన్నప్పుడు నుండి హాస్టళ్లకు పంపియటం, ప్రత్యేకంగా రూములో ఉంచడం, పట్టించుకోక పోవటంతో పిల్లలకు తల్లిదండ్రులకు దూరం పెరుగుతోంది. పిల్లల పట్ల అవగాహన లోపిస్తుంది.

తల్లిదండ్రులు తప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లలకోసం సమయం కేటాయించాలి. వారికి వ్యాయామం, ధ్యానం, క్రీడలు అలవాటు చేయాలి. మానవ సంబంధాలు, మానవీయ విలువలు, సమాజం పట్ల అవగాహన పెంచాలి. ధ్యానం చేసేవారికి మాదక ద్రవ్యాలు తీసుకున్నవారికంటే ఎక్కువ ఆనందం లభిస్తుంది. అలాగే ఇతరులకు మేలు చేయటం, పుస్తకాలు చదవటం, సంగీతం వినటం లాంటివి కూడా పిల్లల మనోబలాన్ని పెంచుతాయి. వారికి ఆసక్తి ఉన్న అభిరుచిలో వారిని ప్రోత్సహిం చినప్పుడు వారి ధ్యాస చెడు అలవాట్లవైపు మళ్లకుండా ఉంటుంది. పిల్లల్లో తాము విలువైన వ్యక్తులమనే భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. వారికి జీవితంలో సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశించి ప్రోత్సహించడం వలన బలమైన వ్యక్తిత్వం గలవారిగా మారతారు. వ్యసనాలకు దూరంగా ఉంటారు. ప్రైమరీ ఎడ్యుకేషన్‌ నుండి ఐ ఆర్‌ ఎడ్యుకేషన్‌ వర్క్‌ మాదకద్రవ్యాలు, గంజాయి వాటి దుష్ఫలితాలు, చట్టాలపై మీద అవగాహన సదస్సులు నిర్వహించాలి. పట్టణాల నుండి పల్లెల వరకు తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలినే అవగాహనా సదస్సు నిర్వహించాలి. ప్రభుత్వం, పోలీస్‌, యాంటి డ్రగ్స్‌ అధికారులు, నిత్యం పర్యవేక్షణ ఉండాలి. ఉత్పత్తి, విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైన ఈ సమాజంలో అందరం భాగస్వాములం. గంజాయి రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు కషిచేయాలి దానికోసం అందరూ కలిసికట్టుగా పని చేద్దాం. మాదకద్రవ్యాలను మానిపిద్దాం. భావితరాలకు బాటలు వేద్దాం.
గంజాయి నిర్మూలనకై డివైఎఫ్‌ఐ పోరు యాత్ర
రాష్ట్రవ్యాప్తంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్‌ఐ యువతీ యువకుల సమస్యలపై ప్రజా ఉద్యమాల్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా డివైఎఫ్‌ఐ డ్రగ్స్‌, గంజాయి ఆన్లైన్‌ బెట్టింగ్స్‌, వీరిని పూర్తిస్థాయిలో అరికట్టాలని రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో పట్టణాలలో అవగాహన సదస్సులు సమావేశాలు నిర్వహిస్తూ యువతీ యువకులకు విద్యార్థులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా ఉద్యమాలే కాదు ప్రజల ఆరోగ్యాలు కూడా ప్రధానమంటూ భావించి గంజాయి, డ్రగ్స్‌, ఆన్లైన్‌ బెట్టింగ్‌ల నుండి విద్యార్థి యువకులను రక్షించాలని, వాటిని నిర్మూలించాలని నల్లగొండ జిల్లాలో సైకిల్‌ యాత్రకు పూనుకుంది డివైఏఫ్‌ఐ. ఈ యాత్ర జూలై 24 నుండి ఆగస్టు 2 వరకు డివైఎఫ్‌ఐ యువ చైతన్యయాత్ర పేరుతో జిల్లా వ్యాప్తంగా పల్లెలను పట్టణాలను కలియ తిరుగుతూ యువతీ యువకులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ చైతన్యవంతులు చేస్తూ ప్రభుత్వంపై, పాలకులపై ఒత్తిడి తెచ్చేందుకు డివైఎఫ్‌ఐ కషి చేస్తుంది. ఈ యాత్రలో యువతి యువకులు విద్యార్థులు కదం తొక్కి కదిలి రావాలని డివైఎఫ్‌ఐ కోరుతుంది.

వీరే కాదు కవులు, కళాకారులు సినీ ప్రముఖులు సినీ యాక్టర్లు క్రీడాకారులు… ఇలా అనేకమంది గంజాయి, డ్రగ్స్‌ ఆన్లైన్‌ బెట్టింగ్స్‌, మహమ్మారికి వ్యతిరేకంగా జరిగేపోరులో వారి వంతు పాత్ర భాగస్వాములు అవుతున్నారు. మనం కూడా కలిసి నడుస్తాం. కలిసి నడుం బిగిద్దాం ఈ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే పోరులో భాగస్వాములు అవుతాం. వాటికి బానిసలుయిన అనేక కుటుంబాల యువతీ యువకులను విద్యార్థులను రక్షిద్దాం .గంజాయి డ్రగ్స్‌ బెట్టింగ్స్‌ రహిత సమాజం కోసం కషి చేద్దాం..
– గడగోజు రవీంద్రాచారి, 9848772232

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -