- Advertisement -
దిగువకు 9825 క్యూసెక్కుల నీటి విడుదల
నవతెలంగాణ – నకిరేకల్
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో శనివారం మధ్యాహ్నం నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని మూసి ప్రాజెక్టు ఐదు గేట్లను అధికారులు ఎత్తి 98 25 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శనివారం ఉదయం వరద ఉధృతి తక్కువ కావడంతో 3, 7, 8 , 10 గేట్ల ను మూసివేశారు. రెండవ నెంబర్ గేట్ ను రెండు అడుగుల మేరకు దించారు. వరద ఉధృతి అధికం కావడంతో అధికారులు మధ్యాహ్నం రెండవ గేటు తో పాటు మూసివేసిన 3, 7, 8 ,10 గేట్లను మూడు అడుగుల మేరకు పైకి ఎత్తి 98 25 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
- Advertisement -