Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం అభినందనీయం 

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం అభినందనీయం 

- Advertisement -

ఎమ్మెల్యేను సన్మానించిన యాకయ్య గౌడ్ 
నవతెలంగాణ – పాలకుర్తి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడం అభినందనీయమని ఎంవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొలుగూరి యాకయ్య గౌడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాకయ్య గౌడ్ మాట్లాడుతూ ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సాహసపేతమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోనె అశోక్ రెడ్డి, నాయకులు నారగోని ఎల్లయ్య, గోగుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -