Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్లిఫ్ట్ లు ఆన్ చేసి జిల్లాలో అన్ని చెరువులు నింపాలి: ఎమ్మెల్యే వేముల

లిఫ్ట్ లు ఆన్ చేసి జిల్లాలో అన్ని చెరువులు నింపాలి: ఎమ్మెల్యే వేముల

- Advertisement -

వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో ఈ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న లిఫ్ట్ లు ఆన్ చేసి జిల్లాలో అన్ని చెరువులు నింపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా జిల్లాలో కానీ, ఇటు బాల్కొండ నియోజకవర్గంలో చెరువులు ఇంకా పూర్తి స్థాయిలో నిండలేదని పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 1086 చెరువులు ఉంటే 377 చెరువులు 25 శాతామే, 424 చెరువులు 50 శాతామే, 204 చెరువులు 75 శాతమే నిండాయన్నారు.

బాల్కొండ నియోజకవర్గంలో 292 చెరువులకు గాను ఒక్క చెరువు కూడా పూర్తిగా నిండలేదని వివరించారు.వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఒక నెల క్రితమే కాళేశ్వరం రివర్స్ పంపింగ్ స్టార్ట్ చేసి వరద కాలువ ద్వారా నీటిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి తీసుకొచ్చినట్లైతే, లిఫ్ట్ లు, వరద కాలువ ద్వారా జిల్లాలో అనేక గ్రామాల చెరువులు నిండేవన్నారు. వరద కాలువ, కాకతీయ కాలువ ద్వారా సాగుకు నీరు ఇచ్చే అవకాశం ఉండేదని,అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.ఈ ప్రభుత్వం కేవలం వర్షాల మీద ప్రాజెక్ట్ లోకి వచ్చే నీటి కోసం ఆధారపడి ఉన్నదని, సాగుకు నీరు ఇవ్వడానికి వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో ఈ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్నారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గత కొన్ని రోజులుగా మంచి వరద కొనసాగుతుందని, ప్రస్తుతం 5658  క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతూ 45 టీఎంసీల నీటి నిలువ ఉందన్నారు.

ఇలాగే ఇంకొన్ని రోజులు కూడా వరద కొనసాగుతుందని సెంట్రల్ వాటర్ కమిషన్‌ ఫ్లడ్ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పై ఉన్న గుత్ప, అలీ సాగర్, చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్, లక్ష్మీ కెనాల్, అనేక లిఫ్ట్ లను స్టార్ట్ చేసి  ఆర్మూర్, బాల్కొండ, నిజమాబాద్ రూరల్  నియోజకవర్గంలో అన్ని చెరువులు నింపాలని, వరద కాలువ ,కాకతీయ కాలువ ద్వారా సాగుకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఒక ప్రణాళిక ప్రకారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పై ఉన్న లిఫ్ట్ మోటార్లు రన్ చేసి, నిరంతరం చెరువులు  నింపే వారిమన్నారు. దీనివల్ల జిలాల్లో అటు బాల్కొండలో  నియోజకవర్గంలో అనేక చెరువులు ఎండాకాలంలో మత్తడి దుంకుతూ నిండుగా ఉండేవని తెలిపారు.

కేసిఆర్ పాలనలో కాలంతో పని లేకుండా లిఫ్ట్ చేసి, వరద కాలువ ద్వారా, ఇతర మార్గాల ద్వారా నీళ్లు నింపేదన్నారు.ఈ కాంగ్రెస్  ప్రభుత్వానికి  ప్రణాళిక లోపించండం వల్ల చెరువులు నిండక, రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మంచి వరద వస్తున్నప్పుడు కూడా లిఫ్ట్ ల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపడం లేదన్నారు.రైతుల మీద ప్రేమ ఉండే ప్రభుత్వం ఉంటే, రైతుల పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి, గుత్ప, అలీసాగర్ లిఫ్ట్, లక్ష్మీ లిఫ్ట్ మోటార్లు ఆన్ చేసి నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేసి బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో అన్ని చెరువులు నింపే ప్రయత్నం చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img