ఆడవి పక్షులను విక్రయిస్తున్న ముగ్గురు షాప్ యజమానులపై కేసు నమోదు
నవతెలంగాణ – కంఠేశ్వర్
జిల్లా కేంద్రంలోని మాలపల్లిలో అటవీశాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులు చేశారు. అటవీ పక్షులను విక్రయిస్తున్న ముగ్గురు షాపు యజమానులపై ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేశారు. మాలపల్లిలోని పలు షాపుల్లో చిలుకలు , కంజు పిట్టలు విక్రయిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేశారు. ఈ దాడిలో అటవీశాఖ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి సుధాకర్ రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.అటవీచట్టం ప్రకారం పక్షులను విక్రయించడం నేరమని అటవీశాఖ రేంజ్ అధికారి సంజయ్గౌడ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని మాలపల్లిలో పక్షులు పెంచి విక్రయిస్తున్నట్లుగా తమకు పక్కా సమాచారం అందిందన్నారు. దీంతో మెరుపుదాడులు చేశామన్నారు.
నగరంలో అటవీ శాఖ అధికారుల మెరుపు దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES