Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అండర్ పాస్ వద్ద లైట్లు ఏర్పాటు చేయాలి..

అండర్ పాస్ వద్ద లైట్లు ఏర్పాటు చేయాలి..

- Advertisement -

డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్
నవతెలంగాణ – మిర్యాలగూడ 

అండర్ పాస్ వద్ద లైట్లు ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్శా డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వాటర్ ట్యాంక్ తండ గ్రామపంచాయతీ డివైఎఫ్ఐ గ్రామ నూతన కమిటీని  ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  చిల్లాపురం వెళ్లేదారిలో ఉన్నటువంటి అండర్ పాస్ వద్ద వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. అండర్ పాస్ వద్ద లైట్లు లేకపోయేసరికి రాత్రిపూట ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర భయాందోళన గురవుతున్నారన్నారు. అండర్పాస్ కింద మొత్తం చిమ్మ చీకటిగా ఉంటుందని తెలిపారు.

తక్షణమే రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ  స్థలాన్ని పరిశీలించి రెండు పక్కల విద్యుత్ స్థంబాల లైట్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు సహాయపడాలని కోరారు. చిల్లాపురం, బాబు సాయి పేట, భాగ్యగోపసముద్రం తండా, వాటర్ ట్యాంక్ తండా, రెడ్డీస్ ల్యాబ్  వెళ్లాలంటే ఆ దారి ఒకటేనని కావున అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ధనావత్ బాబు నాయక్,అశోక్,మౌలాలి, గణేష్, వినోద్, రవి, మంగతా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -