-10 రోజుల్లో మారిన పల్లెల రూపురేఖలు
-నాయినవాని కుంటలో వెలుగుతున్న వీధిలైట్లు
నవతెలంగాణ-పెద్దవూర
రెండేళ్లుగా మండలం లోచాలా గ్రామాల్లో అనేక వీధుల్లో విద్యుద్దీపాలు లేక చీకట్లో మగ్గిన ఆ వీధులు ఇప్పుడు కొన్ని గ్రామాల్లో పున్నమి వెలుగుల విరజీమ్ముతున్నాయి. వెలుగు జిలుగుల్లో మెరిసిపోయే వీధుల్ని చూసి పౌర్ణమి రోజు వెన్నెల్లా వీధి దీపాలు వెలుగుతున్నాయి.మండలం లోని నాయిన వాణికుంట తండా,పర్వేదుల,బసిరెడ్డి పల్లి, శిరసన గండ్ల, సంగారం, బట్టుగూడెం గ్రామాల్లో గత రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేక గ్రామాల్లో చాలా వీధుల్లో వీధి దీపాలు లేక చీకట్లో మగ్గాయి.వర్షాకాలం వీధి దీపాలు వెలుగక అంధకారం అలుముకుంది.కాని పంచాయతీ ఎన్నికలు జరిగిన తరువాత నూతన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే గ్రామాల్లో అన్నీ వీదుల్లో ఎల్ఈడి వెలుగులు పౌర్ణమి నాటి వెలుగులను ప్రజలు సూస్తున్నారు.
సర్పంచులు సొంత ఖర్చులతో గ్రామాలు అభివృద్ధి పథంలోకి దూసుక వెళుతున్నాయి. మండలలోని నాయిన వానికుంటలో గత మూడు,నాలుగు నెలలుగా నాయిన వాని కుంట నుంచి పర్వేదుల రోడ్డు, నాయిన వానికుంట,నాయినవాని కుంట తండాలో పలు వీదుల్లో చీకట్లు అలుము కున్నాయి.కానీ నూతన సర్పంచి గా రమావత్ వినోద్ నాయక్ ఎన్నిక అయిన తరువాత సొంత ఖర్చులతో వీధిదీపాల వెలుగులువిరాజిల్లు తున్నాయి.అలాగే గ్రామ పంచాయతీ బోరు కాలిపోవడం తో దానిని తీసి బాగుచేయించారు. గ్రామంలోచెత్త,పారిశుద్య పనులు చేయించి గ్రామ రూపురేఖలు మారిపోయాయని గ్రామస్తులు చర్చించు కుంటున్నారు. అలాగే ఇంకా చాలా గ్రామాల్లో నూతన సర్పంచులు గ్రామాలను అభివృద్ధి పథం లో ముందుకు తీసుకెళ్ళుటకు ప్రయత్నంలో ఉన్నారు.


