మనం ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించాలంటే రోగ నిరోధక వ్యవస్థ పని తీరు బాగుండాలి. లేకపోతే బ్యాక్టీరియా, వైరస్, పారసైట్స్ వంటివి మన శరీరానికి హాని చేస్తాయి. ఎప్పుడైతే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ వంటివి మన శరీరంలోకి ప్రవేశిస్తాయో మన రోగనిరోధక వ్యవస్థ వాటిపై దాడి చేస్తుంది. ఇటువంటి హానికరమైన వాటి నుంచి రక్షించడమే కాదు.. శరీరంలో ఉండే మృతకణాలను తొలగించడానికి కూడా ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఇంట్లో రుచి కోసం అల్లం వాడతారు. నిజానికి అల్లం గొప్ప ఔషధం. మసాలా దినుసులను వాడే వంటకాల్లో అల్లంను తప్పకుండా ఉపయోగిస్తుంటాం. . మసాలా దినుసుల వల్ల మనకు ఏదైతే ప్రయోజనం ఉంటుందో, అదేవిధంగా అల్లంతోనూ చాలా ఉపయోగాలుంటాయి. అలాగే విటమిన్ సి ఉండే పండ్లు, క్యాప్సికం, బ్రోకలి, అల్లం, వెల్లుల్లి, పాలకూర, బాదం, పసుపు, గ్రీన్ టీ, బొప్పాయి, కివి వంటివి రోగనిరోధక వ్యవస్థకు చాలా అవసరం. ఇటువంటి ఆహార పదార్థాలను మీ రోజువారి ఆహారంలో భాగంగా తీసుకుంటే మీ రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
వీటి వల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి ఆహార పదార్థాల్లో అల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. అల్లంలో మినరల్స్, ఎమినో ఆసిడ్స్, ఎంజైమ్స్, కో- ఎంజైమ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. గొంతు నొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి. వికారం వల్ల ఉదయాన్నే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు జింజర్ షాట్స్ లేదా అల్లంను ఉదయాన్నే తీసుకోండి. ఈ సమస్య చాలా త్వరగా తొలగిపోతుంది. వీటన్నిటితో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసైటిక్ గాను, బీ12 ఉత్పత్తి అవడానికి, హైపర్ రియాక్టివిటీని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లం యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పారాసైటిక్ మాత్రమే కాదు ఒత్తిడిని దూరం చేయడానికి ఎంతో సహాయం చేస్తుంది. స్టమక్ అప్సెట్ ఉన్నవారు కూడా అల్లం తప్పకుండా తీసుకోండి.
అల్లంతో ఇలా…
- Advertisement -
- Advertisement -



