దుంపకూరల్లో దాదాపు అందరూ ఇష్టపడే దుంప ఆలుగడ్డ. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు. ముఖ సౌందర్యానికి, చర్మ సౌందర్యానికీ చాలా మంచిది.ఇందులో విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.దీనికి హైపర్‌పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్‌ని తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేసే సామర్థ్యాలులున్నాయి. ఆలు రసం లేదా ”బంగాళాదుంప ఫేస్ మాస్క్”ని క్రమం తప్పకుండా వాడడం వల్ల ఈ అవాంఛిత మచ్చలు క్రమంగా తగ్గుతాయి. ఇందులోని అధిక నీటి శాతం సున్నితమైన కంటి ప్రాంతాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఈ దుంప ముక్కల్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల కండ్లు రిఫ్రెష్‌గా ఉంటాయి.
బంగాళాదుంపలు ఫ్లేవనాయిడ్లు , ఫినోలిక్ ఆమ్లాలు వంటి సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి మొటిమలకు చక్కటి పరిష్కారంగా పని చేస్తాయి. తామర లేదా ఇతర చర్మ పరిస్థితులతో సంబంధం ఉన్న ఎరుపు, వాపు చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. ఎక్కువ చలి, లేదా సూర్యరశ్మి వలన కమిలిన చర్మానికి కూడా ఉపశమనం లభిస్తుంది. బంగాళాదుంప రసం లోని స్టార్చ్ కంటెంట్ చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది.
ఎలా వాడాలి?
డార్క్ సర్కిల్స్ : తాజా ఆలుగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి నేరుగా కంటి కింద నల్లగా ఉన్న ప్రాంతంలో ఉంచండి. ఈ ముక్కలను 15-20 నిమిషాలు అలాగే ఉంచండి, తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. సున్నితమైన కంటి ప్రాంతాన్ని మరింత ఉపశమనం చేయడానికి , హైడ్రేట్‌గా ఉంచటానికి కొన్ని చుక్కల కలబంద జెల్‌ను చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి.
ఆలు, ఓట్‌మీల్, మిల్క్ స్క్రబ్: ఆలు తురుమును రెండు టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్ , ఒక టేబుల్ స్పూన్ పాలతో కలపండి. ఈ స్క్రబ్‌ను ముఖంపై అప్లరు చేసి, సున్నితంగా మసాజ్ చేయండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటేచక్కటి షైనింగ్ వస్తుంది.
ఫేస్ మాస్క్ : బంగాళాదుంప, శనగపిండి, నిమ్మకాయ ఫేస్ వాష్: బంగాళాదుంప తురుము, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి ,సగం నిమ్మకాయ రసం కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తరువాత సున్నితంగా వాష్ చేసుకోవాలి. దాంతో ఫేస్ మురికి తొలగుతుంది.
ఆలూతో ఇలా…
- Advertisement -
- Advertisement -