ముఖానికి ఆలుగడ్డ రసాన్ని రాసుకోవటం చేయటం వల్ల చాలా మార్పులు కనిపిస్తాయి. దీనిని క్రమం తప్పకుండా కనీసం వారంలో 2 రోజులు వాడితే చర్మ సమస్యలు చాలా వరకూ తగ్గుతాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఆలు రసాన్ని ముఖంపై పూయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. దీంతో స్కిన్ కూడా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. ముఖానికి బంగాళాదుంప రసాన్ని తరచూ అప్లై చేయటం వల్ల మచ్చలేని చర్మాన్ని పొందవచ్చు. ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఈ రసంలో హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి. మీకు సున్నితమైన లేదా చికాకు కలిగించే చర్మం ఉంటే, ఆలుగడ్డ రసం రాయడం వల్ల మంటను తగ్గించి, హైడ్రేషన్ అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.ఈ రసం కొత్త ఆరోగ్యకరమైన చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది మొటిమల మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ రసం నల్ల మచ్చలను తేలికపరచడానికి, చర్మపు రంగును మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్ల వంటి యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
ఆలుతో ఇలా…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



