Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ అధ్యక్షతన లింబూర్ పాలక వర్గ సమావేశం

సర్పంచ్ అధ్యక్షతన లింబూర్ పాలక వర్గ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్
లింబూరు గ్రామ సర్పంచ్ సుజాత శివారెడ్డి అధ్యక్షతన బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో గల పలు సమస్యల గురించి చర్చించినట్లు ఆ గ్రామ కార్యదర్శి తెలిపారు. ప్రజల అవసరాలను బట్టి అభివృద్ధి పనులు చేపట్టడానికి పాలకవర్గం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో వీధిలైట్ల ఏర్పాటు మురికి కాల్వల శుభ్రత త్రాగినీటి సమస్య లేకుండా నివారణ చర్యలు ముఖ్యంగా చర్చించినట్లు తెలిపారు. ఈ సాధారణ సమావేశంలో ఉప సర్పంచ్ సంతోష్, గ్రామ కార్యదర్శి శశిధర్, పంచాయితీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -