బడ్జెట్‌పై మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ- హయత్‌నగర్
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాగితాలకే పరిమితమయ్యేలా ఉందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోందని, అది పేదలకు అందేవిధంగా ఖర్చు చేయడం లేదని అన్నారు. బడ్జెట్ పెట్టిన ప్రతిసారీ కాకి లెక్కలు చెబుతారు కానీ పేదలకు సక్రమంగా అందే విధంగా ప్రభుత్వాలు పనిచేయకపోవడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. మేడి పండు మేలిమై ఉండు అన్న చందంగా ఉందని, గత బడ్జెట్‌ను చూసి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు కనిపిస్తున్నదన్నారు. రైతులకు రైతుబంధు లేదన్నారు. ప్రజలను మోసం చేసే విధంగా బడ్జెట్ ఉందన్నారు.



