- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
లైన్మెన్ దివాస్ దినోత్సవంలో భాగంగా నేషనల్ విద్యుత్ థర్మల్ పవర్(ఎన్.పి.డి.సి.ఎల్)యజమాన్యం ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్లలో లైన్మేన్ దివాన్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థలో యుద్ధ ప్రాతిపదికన విధులు నిర్వహించే ఉద్యోగులను, ఫీల్డ్ లో పనిచేసే లైన్మెన్స్,ఆపరేటర్స్, ఆన్ మ్యాన్ వర్కర్స్ లను మండల విద్యుత్ శాఖ ఇంచార్జి ఏఈ శేఖర్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



