ఆర్థికశాఖ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది కచ్చితంగా ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ (ఐఎఫ్‌ఎంఐఎస్)కు ఆధార్ లింక్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. శనివారం అర్థరాత్రి వరకు ఇందుకు గడువు విధించింది. ఆలోగా ఆధార్ లింక్ చేయాలనీ, లేదంటే వేతనాలు నిలిచిపోతాయంటూ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కలిపి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. వీరందరి పేర్లు, హౌదా, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నింటినీ ప్రతీ నెల 10 వరకు ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ (ఐఎఫ్‌ఎంఐఎస్)లో నమోదు చేయాలంటూ సెప్టెంబరులో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఈనెల 16 వరకు సగం మంది ఉద్యోగులు కూడా తమ తమ వివరాలను నమోదు చేసుకోలేదు. ఈ క్రమంలో వివరాలివ్వాలంటూ ఆర్థికశాఖ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల సమగ్ర వివరాలన్నీ లేకపో వడంతో కొన్నిచోట్ల అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులం దుతున్నాయి. కొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులు మానేసినా, అనధికారికంగా సుదీర్ఘ సెలవులో వెళ్లినా వారి పేర్లతో వేతనాలు డ్రా చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేరు, ఆధార్, సెల్ నంబర్లతో పోల్చి చూస్తే ఎంత మంది ఉద్యోగులు ఉన్నారనే స్పష్టమైన వివరాలు అందుతాయని భావించి, వివరాలు పంపాలని కోరగా పలు కార్యాలయాలు స్పందించ లేదనీ, అందుకే తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేశామని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు.
ఆధార్ లింక్ చేయండి.. లేదంటే వేతనాలు నిలిపేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



