Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంపోలవరం నుంచి బనకచర్ల వరకూ లింకు ప్రాజెక్టు

పోలవరం నుంచి బనకచర్ల వరకూ లింకు ప్రాజెక్టు

- Advertisement -

– జలహారతి కార్పొరేషన్‌
ఎస్‌పీవీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి :
పోలవరం – బనకచర్ల లింకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ) ఏర్పాటు చేసింది. దీనికి జలహారతి కార్పొరేషన్‌ లిమిటెడ్‌(జెహెచ్‌సీఎల్‌) ఏర్పాటు చేసింది. ఈ మేరకు జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. పోలవరం నుంచి బనకచర్ల వరకూ లింకు ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ద్వారా సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని వినియోగించుకోవాలనే పేరుతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీనికి కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా రుణాల వినియోగం, పనుల నిర్వహణ కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. దీని ప్రధాన కార్యాలయం ఇరిగేషన్‌ భవనాల సముదాయంలోని రైతు శిక్షణా కేంద్రంగా పేర్కొంది. జలహారతి కార్పొరేషన్‌ 100 శాతం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సొంత కంపెనీగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img