- Advertisement -
ప్రపంచ జూనియర్ జూడో పోటీలు
లిమా (పెరు): భారత యువ జుడోకా లింథోయ్ చానంబమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పెరులోని లిమా వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ జూడో చాంపియన్‌షిప్స్‌లో లింథోయ్ కాంస్య పతకం గెలిచింది. జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ చరిత్రలో భారత్ తరఫున పతకం నెగ్గిన తొలి క్రీడాకారిణిగా లింథోయ్ రికార్డు నెలకొల్పింది. 19 ఏండ్ల ఈ మణిపూర్ అమ్మాయి తొలుత నిరాశ పరిచినా.. ఆ తర్వాత రెపిచేజ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కాంస్య పోరుకు అర్హత సాధించింది. మహిళల 63 కిలోల కాంస్య పోరులో నెదర్లాండ్స్ జూడోకా జోనీ గిలెన్‌ను ఓడించి లింథోయ్ బ్రాంజ్ మెడల్ సాధించింది.
- Advertisement -