నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో స్థానిక జాతీయ స్థాయి సీనియర్ ఫోటోగ్రాఫర్ లుక్క గంగాధర్ ను సత్కరించారు. మేరకు మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రఫీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా లుక్క గంగాధర్ నియమితులైన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ సత్కరించారు.
గంగాధర్ ను లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులను అలంకరించి పేరు పైఖ్యాతలు పొందాలని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి కార్యదర్శి తెడ్డు రమేష్, సభ్యులు చిలువేరి పన్ కుమార్, సురంగి చంద్రశేఖర్, చింత ప్రదీప్, బద్దం రాజశేఖర్, కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల బాలకృష్ణ, సభ్యులు పెంట కిషన్, సుంకేట శ్రీనివాస్, భోగ శ్యామ్, జగన్, తదితరులు పాల్గొన్నారు.



