• రూ. 20 వేల విలువైన 2 కుట్టు మిషను అందజేత
• ప్రధానోపాధ్యాయుడు పినగాని కళాధర్
నవతెలంగాణ-పెద్దవంగర:
ప్రభుత్వ పాఠశాల విద్యాభివృద్ధికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ప్రధానోపాధ్యాయుడు పినగాని కళాధర్ అన్నారు. మండలంలోని అవుతాపురం పీఎంశ్రీ ఉన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు వారు రూ.20 విలువైన 2 కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సూర్నం రామనర్సయ్య, ప్రధాన కార్యదర్శి ముడుపు రవీందర్ రెడ్డి, కోశాధికారి వజినపల్లి శ్రీనివాస్ తో కలిసి ప్రధానోపాధ్యాయుడు మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల అభ్యున్నతికి లయన్స్ క్లబ్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. విద్యార్థులు అంకితభావంతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగిశెట్టి రమేష్ కుమార్, సింహాద్రి, సమ్మయ్య, సురేందర్, సోమయ్య, రామతార, శిల్ప అజయ్ తదితరులు పాల్గొన్నారు.



