లయన్స్ ఇంటర్నేషనల్ ఐదవ రీజియన్ చైర్మన్ ఉదయ సూర్య భగవాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : లయన్స్ సేవలను మరింత విసృతపర్చాలని లయన్స్ ఇంటర్నేషనల్ ఐదవ రీజియన్ చైర్మెన్ ఉదయ సూర్యభగవాన్ సూచించారు. ఆదివారం ఉదయం నిజామాబాదు నగరంలోని కపిల హోటల్ కాన్పరెన్స్ హాల్ లో లయన్స్ క్లబ్ లో పీఎస్టీల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆర్సీ ఉదయ సూర్యభగవాన్ మాట్లాడుతూ.. ఆయా క్లబ్ ల అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారితో పాటు ఇతర కార్యవర్గం అంకితభావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రొటీన్ కార్యక్రమాలకు భిన్నంగా ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. లయనిజంలో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు నూతన క్లబ్ ల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం, జిల్లా కార్యదర్శులు డి.యాదగిరి, పి.లక్ష్మినారాయణ,కరిపె రవీందర్, ఎం.శంకర్,ద్వారకాదాస్ అగర్వాల్,రీజియన్ కో-ఆర్డినేటర్ నాగేశ్వరరావు,జోన్ చైర్మెన్లు నరసింహరావు,భూమన్న తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ సేవలను మరింత విసృతపర్చాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES