– జెసిబి తో బయటికి లాగిన ఎక్సైజ్ అధికారులు!
– మద్యం విలువ సుమారు 5 లక్షల రూపాయలు
నవతెలంగాణ-చింతలపాలెం : మేళ్లచెరువు మండలం రామపురంలో నకిలీ మద్యం తయారీ, నిల్వకు సంబంధించి రెండు రోజుల క్రితం ఎక్సైజ్ అధికారులు దాడి నిర్వహించి భారీగా మద్యం పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించిన అధికారులు, రామపురానికి చెందిన ఏ-1 ముద్దాయిగా ఉన్న తోట శివశంకర్ స్నేహితుడు రంగుశెట్టి సైదేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో సైదేశ్వరరావు తన పంట పొలంలో జెసిబి సహాయంతో భూమిలో రెండు చోట్ల 100 ఎంసీ మద్యం కాటన్లను ట్రాక్టర్ ద్వారా తరలించి దాచిన విషయం బయటపెట్టాడు. దీంతో ఎక్సైజ్ సిబ్బంది అతడిని వెంట తీసుకెళ్ళి, జెసిబి సాయంతో భూమిలో దాచిన నకిలీ మద్యం కాటన్లను వెలికితీశారు. బయటకు తీయుతుండగా సీసాలలో కొన్ని పగిలిపోవడంతో, అవి పూర్తిగా పగలగొట్టి మట్టితో పూడ్చేశారు. సుమారు 5 లక్షల మద్యం బాటిళ్ల ను భూమిలో దాచి పెట్టిన నకిలీ మద్యం బాటిళ్లు. నకిలీ మద్యం దాచిపెట్టడానికి సహకరించిన ఇద్దరిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అలాగే మద్యం తరలించడానికి ఉపయోగించిన జెసిబి, రెండు ట్రాక్టర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం ఆంధ్రప్రదేశ్‌కు తరలించడానికి, స్థానిక ఎన్నికల్లో పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. తదుపరి దర్యాప్తులో నవీన్ అనే వ్యక్తి ఇంట్లో కూడా 6 కాటన్ల మద్యం లభించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అదే విధంగా, చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలోనూ నకిలీ మద్యం, కొంత నగదు కూడా పట్టుబడినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్. లక్ష్మనాయక్, హుజూర్నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భూమిలో దాక్కున్న మద్యం బాటిళ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES