- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇవాళ (శుక్రవారం) జూబ్లీహిల్స్‌లో మాత్రమే మద్యం దుకాణాలు, బార్లు, కళ్లుకాంపౌండ్లు మూసివేతకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 11న జరిగిన బైపోల్‌కు సంబంధించిన కౌంటింగ్ నేడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. కాగా, మధ్యాహ్నం 12లోపు ఫలితాలపై స్పష్టత రానుంది.
- Advertisement -



