నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజాశాంతి భద్రతలు కాపాడటానికి మద్యం దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని పోలీస్, ఎక్సైజ్, ఆదాయ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సమయాలలో గ్రామ పంచాయతీల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా జిల్లా వ్యాప్తంగా సంబంధిత మండలాల్లోని బార్లు, రెస్టారెంట్లు, మరియు కల్లు దుకాణాలు క్రింది తెలిపిన విధంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
దుకాణాల మూసివేత వివరాలు
ఫేజ్ – 1, ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆత్మకూర్ (ఎం), బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో తేది:09-12-2025 సాయంత్రం 5.00 గంటల నుండి పోలింగ్ మరియు కౌంటింగ్ ముగిసే వరకు (11-12-2025) మూసివేయాలన్నరు..
ఫేజ్ –2, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల్లో తేది: 12-12-2025 సాయంత్రం 5.00 గంటల నుండి పోలింగ్ మరియు కౌంటింగ్ ముగిసే వరకు (14-12-2025) మూసివేయాలన్నరు.
ఫేజ్ – 3, చౌటుప్పల్, నారాయణపూర్, అడ్డగూడూర్, మోత్కూర్, గుండాల, మోటకొండూర్,6 మండలాల్లో తేది: 15-12-2025 సాయంత్రం 5.00 గంటల నుండి పోలింగ్ మరియు కౌంటింగ్ ముగిసే వరకు (17-12-2025) మూసివేయాలన్నారు
ప్రజా శాంతి భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు, ఆదాయ, ఎక్సైజ్ శాఖలు కఠినంగా పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు. చట్ట ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



