జిల్లాలో A4 మద్యం దుకాణాలు మొత్తం 48
గౌడ్లకు 9, ఎస్సీలకు 5 కేటాయింపు
ఐడీఓసీలో ఏర్పాట్లు
జిల్లా ఎక్సైజ్ అధికారి రాధాకృష్ణారెడ్డి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లాలో 2025- 2027 సంవత్సరం వరకు కొనసాగనున్న A4 మద్యం షాపుల లక్కీ డ్రా (సోమవారం) ఈ నెల 27న నిర్వహించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రాధాకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 48 దుకాణాలు ఉన్నాయని, వాటిలో గౌడ్లకు 9, ఎస్సీలకు 5 రిజర్వేషన్ ప్రకారం కేటాయించామని వెల్లడించారు. సెప్టెంబర్ 26వ తేదీన టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరణ మొదలు పెట్టామని, దరఖాస్తులు ఈ నెల(అక్టోబర్) 23వ తేదీ వరకు స్వీకరించామని తెలిపారు. మొత్తం దరఖాస్తులు 1381 వచ్చాయని వెల్లడించారు. దుకాణాల లైసెన్స్ కేటాయించేందుకు లక్కీ డ్రాను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో రేపు సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి తీయనున్నట్లు వివరించారు. డిసెంబర్ 01వ తేదీ నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయని తెలిపారు.
మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా రేపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



