Sunday, December 21, 2025
E-PAPER
Homeకవితసాహిత్య సౌరభాలు

సాహిత్య సౌరభాలు

- Advertisement -

అక్షరాల తోటలో అల్లుకున్న భావపుష్పాలు
పదాల పుప్పొడితో పరిమళించు సౌరభాలు
కలం తాకితే హదయమే వికసించి
మౌనాల మడిలోంచి
మధురనాదం పొంగుతుంది
శబ్దాలే శిల్పాలై భావాలే రంగులై
మనసు గవాక్షంలో
అందాల చిత్రాలవుతాయి
వేదనకూ ఓ పరిమళం
ఆనందానికీ ఓ వాసన
సాహిత్య సౌరభాలే జీవితానికి జ్ఞానగంధం
కాలం మారినా కలముశక్తి తరగదు
కవితా సౌరభాలు తాకుతూనే ఉంటాయి
సాహిత్యసౌరభాలు ఆస్వాదించుదాం
అంతరంగాలను ఆనందపరుద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -