Sunday, February 8, 2026
E-PAPER
Homeజోష్డిజిటల్‌ యుగంలో సాహిత్య సృజన

డిజిటల్‌ యుగంలో సాహిత్య సృజన

- Advertisement -

డిజిటల్‌ యుగంలో ప్రపంచమంతా కొత్త పోకడలు పోతోన్న కాలమిది. కృత్రిమ మేధ (ఏఐ) మునుపెన్నడూ లేనంతగా అన్ని సామాజిక వ్యవస్థల్లోకి దూసుకొస్తోన్న సమయమిది. ముఖ్యంగా, యువత జీవనశైలి పెనుమార్పులకు గురవుతోన్న తరుణమిది. యువత ఆలోచనల్ని, వారి చైతన్యాన్ని ప్రభావితం చేస్తున్న సంధి దశ ఇది. ఒకరకంగా ‘ఏఐ’ నిర్దేశించిన మూసల్లోకి వారి జీవితాలు కుదించబడడం, అదే ‘ఏఐ’ని ఉపయోగించుకొని అవకాశాలను అందిపుచ్చుకోవడం రెండింటినీ అనుభవంలోకి తీసుకుంటున్న ఒక సంక్లిష్ట సందర్భమిది. సాహిత్యంవంటి సజనరంగాల ‘మౌలికత’ లేదా ‘స్వతంత్రత’ సంక్షోభానికి గురువుతోన్న కాలంలో యువ రచయితల ఆలోచనలు, వారి దక్పథాలు ఎలా ఉన్నాయి? వారి రచనా వ్యాసంగంపై సామాజిక, సాంకేతిక రంగాలు ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? వారి సాహిత్య ప్రయాణం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి? మొదలైన ఎన్నో వైవిధ్యమైన విషయాలను, వాటికి పరిష్కార మార్గాలను సామూహికంగా అన్వేషించాలనే లక్ష్యంతో తెలుగు శాఖ, ఆర్ట్స్‌ కాలేజి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ”తెలుగు లిటరరీ కాంగ్రెస్‌-2026ను 09 ,10 ఫిబ్రవరి, 2026న నిర్వహించబోతుంది.

లిటరరీ కాంగ్రెస్‌ నేపథ్యం
విశ్వవిద్యాలయ స్థాయిల్లో ‘హిస్టరీ’కి ‘ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌’, ‘సైన్స్‌’కు ‘ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌’లు ఉన్నాయి. తెలుగు భాషాసాహిత్యాల పరిశోధనకు, అధ్యయనానికి అటువంటివి లేవు. విశాలమైన ప్రాతిపదికను, దార్శనికమైన భావనను తెలుగు సాహిత్య ప్రపంచంలో నెలకొల్పాలనే ప్రధాన లక్ష్యంతో ఆర్ట్స్‌ కళాశాల, ఉస్మానియా విశ్వవిదాలయంలో మొదటి తెలుగు లిటరరీ కాంగ్రెస్‌ 15, 16, 17 ఫిబ్రవరి, 2024న ఏర్పాటైంది. దానికి అధ్యక్షుడిగా ఆనాడు తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్న ఆచార్య చింతకింది కాశీం ఎంపికయ్యారు. వివిధ విశ్వవిద్యాలయాలనుంచి కార్యవర్గం ఎంపిక చేయబడింది.

మొదటి లిటరరీ కాంగ్రెస్‌ విశేషాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలనుంచి లబ్దప్రతిష్టులైన 150 మంది సాహితీవేత్తలు పాల్గొని ఆ సభలను విజయవంతం చేశారు. రెండురోజులు ఆర్ట్స్‌ కళాశాల ముందు కవితా పొద్దు, కవితా వసంతం పేర్లతో ఏర్పాటుచేసిన బహిరంగ వేదికనుంచి 40 మంది కవులు/ గాయకులు పాల్గొనడం ఆ సభల మరో విశేషం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కాంగ్రెస్‌ ను నిర్వహించుకోవాలని కార్యవర్గం నిర్ణయించింది. ఆ పరంపరలో 09 డ10 ఫిబ్రవరి, 2026న నిర్వహించబోతున్న ”తెలుగు లిటరరీ కాంగ్రెస్‌” రెండోది.

రెండో లిటరరీ కాంగ్రెస్‌ ఉద్దేశ్యాలు, లక్ష్యాలు:
వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం విభిన్నమైన ప్రక్రియలతో, వైవిధ్యమైన తాత్త్వికతతో ఎంతో సంపద్వంతంగా ఉంది. ఈ క్రమంలో తెలుగు సాహిత్యం డిజిటల్‌ రూపం తీసుకుంటున్న ఈ యుగంలో యువరచయితల కేంద్రంగా ఈ మహాసభ ఉండబోతుంది. ముఖ్యంగా, విద్యార్థి, సామాజిక ఉద్యమాలు బలహీనమవుతోన్న ఈ డిజిటల్‌ యుగంలో యువత ఆలోచనల్ని ఆవిష్కరించుకోవడం, అకడమిక్‌ డిస్కోర్స్‌ కు ఒక అవకాశాన్ని కల్పించడం ఈ మహాసభ కీలకోద్దేశం.

రెండో లిటరరీ కాంగ్రెస్‌లో చర్చించే అంశాలు
ఈ రెండు రోజులపాటూ జరిగే లిటరరీ కాంగ్రెస్‌లో డిజిటల్‌ యుగంలో-సాహిత్య సజన, మేమెందుకు రాస్తున్నాం?, సమాజ, సాహిత్య సంబంధాలు- యువ రచయితల స్పందనలు, సోషల్‌ మీడియా- లైక్స్‌, షేర్స్‌, వైరల్‌ సాహిత్యం-అభిప్రాయాలు, యువ రచయితల సాహిత్యం-గమనం, గమ్యం-పానెల్‌ డిస్కషన్‌, సీనియర్‌ రచయితల నుంచి మేమేం కోరుకుంటున్నాం?, కత్రిమ మేధ సందర్భంలో ”సజన’ సంక్షోభం, సాహిత్య పురస్కారాలు-యువత ఆలోచనలు, యువ రచయితలు- అనువాదాలు, ముద్రణారంగం, కవి, గాయక/ జానపద ప్రదర్శనకారులతో సాంస్కతిక సమ్మేళనం.

రెండో లిటరరీ కాంగ్రెస్‌ విశేషాలు
35 సంవత్సరాలలోపు యువత చేస్తున్న సాహిత్య సజన కేంద్రంగా ఈ రెండో లిటరరీ కాంగ్రెస్‌ రూపొందించబడింది. వారి సజనను వాళ్లచేతనే మూల్యాంకనం చేయించడం, ఈ క్రమంలో వారు చేసిన ప్రయాణం, ఎదుర్కొన్న ఒడిదుడుకులు, అధిగమించి నిలబడిన సందర్భాలను రికార్డ్‌ చేయడం ఈ మహాసభల లక్ష్యం. ఈ మహాసభలో అందరూ యువ సాహితీవేత్తలే రిసోర్స్‌ పర్సన్స్‌ గా తమ అభిప్రాయాలను కలబోసుకుంటారు. ఈ కాంగ్రెస్‌ లో పాల్గొనబోయే విద్యార్థులు, సాహిత్య పిపాసకులు మొదలైన వారందరూ యువతే కావడం మరో విశేషం. వారికి తెలుగు భాషాసాహిత్యాలపట్ల, సామాజిక నిబద్ధత పట్ల, సంస్కతిపట్ల గాఢానుభూతిని, ఎరుకను కలిగించడం ఈ కాంగ్రెస్‌ ఉద్దేశం.

లిటరరీ కాంగ్రెస్‌ కార్యక్రమాలు
ప్రారంభ, సమాపనోత్సవాలతో పాటూ ఈ మహాసభలో మొత్తం పద్నాలుగు సమావేశాలుంటాయి. ప్రొఫెసర్‌ చింతకింది కాశీం అధ్యక్షతన జరిగే ప్రారంభ సమావేశంలో అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగరం పాల్గొంటారు. ప్రొఫెసర్‌ వెలుదండ నిత్యానంద రావు, ప్రొఫెసర్‌ సాగి కమలాకర శర్మ పాల్గొంటారు. ఈ రెండు రోజులపాటు జరిగే 10 సమావేశాల్లో ప్రతి సెషన్‌ లో ఐదుగురు చొప్పున 55 మంది యువ రచయితలు పాల్గొంటారు. అందులో ఐదు ప్యానెల్‌ డిస్కషన్స్‌ ఉంటాయి. అనుభవజ్ఞులైన రచయితలు సెషన్స్‌ కు ఒకరు చొప్పున ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారు. ఆత్మీయ అతిథులుగా కవి యాకుబ్‌, నందిని సిధారెడ్డి, విమల మోర్తల, పిల్లలమర్రి రాములు, కుప్పిలి పద్మ, డా. చంద్రయ్య శివన్న, నరేష్‌ కుమార్‌ సూఫీ, ఎండ్లూరి మానస, అరుణాంక్‌ లత పాల్గొంటారు. రెండు రోజలపాటు జరిగే సాంస్కతిక ప్రదర్శనలు సాయంత్రం-5:00 గంటల నుంచి రాత్రి-9:00 గంటల వరకు కొనసాగుతాయి. వీటిలో కవితా దునియా, కవితా జిందగి పేర్లతో రెండు తెలుగు రాష్ట్రాలనుంచి కవులు, గాయకులు జానపద ప్రదర్శనకారులు 40 మంది పాల్గొంటారు. వీరంతా ఆర్ట్స్‌ కాలేజి ముందు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బహిరంగ వేదికమీద నుంచి వేలాదిమంది సమక్షంలో సాముహిక కవితాపఠనం/ గానం/ ప్రదర్శన చేస్తారు. కవితా దునియా, కవితా జిందగి పేర్లతో జరిగే సాంస్కతిక సభకు డా. ఏనుగు నరసింహారెడ్డి అతిథులుగా పాల్గొంటారు. కాసర్ల శ్యామ్‌, చరణ్‌ అర్జున్‌, రేలారే ప్రసాద్‌, రోజారమణి, రాము రాథోడ్‌ వంటివారు, సమాపన సమావేశంలో ప్రొఫెసర్‌ బాలకష్ణారెడ్డి, ప్రొఫెసర్‌ సూర్యాధనంజరు, గోరటి వెంకన్న, డా. నామోజు బాలాచారి పాల్గొంటారు. ఈ రెండు రోజుల సభల్లో విదేశీ ప్రతినిధులుగా విశ్వేశ్వర్‌ రెడ్డి కలవల, డా. దశరథ యాట, హరీందర్‌ రెడ్డి, బిందు గొంగటి పాల్గొంటారు.

”తెలుగు సాహిత్య మహాసభలు” (TELUGU LITERARY CONGRESS) మిగతా సాహిత్య సభల కంటే పూర్తిగా భిన్నమైనవి. ఈ సభలు సాహిత్యాన్ని నిర్మించడం నుండి ప్రేమించడం వరకు వివిధ ప్రత్యేక దారులను ఒక రహదారికి కలిపే కూడలి వలే పనిచేస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ అందుకు వేదిక అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకప్పటి ఆంధ్ర మహాసభల వలే ఈ తెలుగు సాహిత్య మహాసభలు సాహిత్య లోకంలో చరిత్రకు సాక్ష్యాలు అవుతాయి 2026 సభలో నాకు అవకాశం రావడం చాలా సంతోషం.
– దండు వెంకట్‌ రాములు

ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో తెలుగు సాహిత్య మహాసభలు (ుూజ 2026) అక్షరానికి, ఆధునిక సాంకేతికతకు మధ్య వారధిగా నిలుస్తున్నాయని భావిస్తున్నాను. ముఖ్యంగా ‘సోషల్‌ మీడియా- లైక్స్‌, షేర్స్‌ డ వైరల్‌ సాహిత్యం’ అనే అంశంపై నా అభిప్రాయాలను పంచుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. నేటి డిజిటల్‌ యుగంలో సాహిత్యం పుస్తకాల నుండి స్మార్ట్‌ఫోన్‌లకు మారుతున్న తరుణంలో, యువతరం సజనను ప్రోత్సహించడం మరియు కృత్రిమ మేధ (AI) వంటి సవాళ్లను ఎదుర్కోవడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. సాహిత్య ప్రియులందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. డిజిటల్‌ యుగంలో తెలుగు సాహిత్యం కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఈ సందర్భంలో సాహిత్య సభలు (Literary Congress) విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఆలోచనా వేదికలుగా పనిచేస్తాయని భావిస్తున్నాను. ఇవి సాంప్రదాయ సాహిత్య అవగాహనతో పాటు ఆధునిక సాహిత్య ధోరణులు, విమర్శాత్మక ఆలోచన, సజనాత్మక రచన నైపుణ్యాలను పెంపొందిస్తాయి. అలాగే యువ పాఠకులు, కవులు తమ భావాలను డిజిటల్‌ మాధ్యమాల్లో వ్యక్తపరచడం, భాషా విలువలను కాపాడుకోవడం నేర్చుకునే అవకాశం లభిస్తుంది. అందువల్ల సాహిత్య సభలు అకడమిక్‌ అభ్యాసాన్ని సమాజంతో అనుసంధానించే ముఖ్యమైన వేదికలుగా నిలుస్తాయి.
-ఉదయ్‌ కిరణ్‌

ప్రస్తుతం మిలీనియం తరం పోయి జెన్‌ జీ తరం సాహిత్యంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. సజనలో కూడా కత్రిమత్వం ప్రవేశించింది. గత కాలపు సాహిత్య పరికరాలతో నేటి తరం సాహిత్యాన్ని రాయడానికి సిద్ధంగా లేదు. ఇలాంటి సమయంలో సజనను కాపాడుకోవడం, సమాజానికి, సాహిత్యానికి మధ్య ఉన్న ఆరోగ్యకరమైన సంబంధాలను తర్వాత తరానికి అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. దాన్ని తెలుగు లిటరరీ కాంగ్రెస్‌ 2026 నెరవేరుస్తుంది. సాహిత్యంలోకి వస్తున్న నూతన తరాన్ని సాహిత్య రంగంలో స్థిరపరచడానికి ఈ సమావేశం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఇప్పటికే సాహిత్యంలో యువ కవులు సమాజం పై తమకున్న బాధ్యతను, సమాజంలో జరుగుతున్న విషయాల గురించి తమ స్పందలను బలంగా వినిపిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా ఎంతో మంది యువ కవులు, రచయితలు, గాయకులు, విమర్శకులు సాహిత్యంలోని భిన్న కోణాలను చర్చ చేయనున్నారు. దీని నుండి వచ్చే ప్రతిఫలం తెలుగు సాహిత్యాన్ని మరొక మెట్టు ఎక్కిస్తుంది.
– లావణ్య

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఆంగ్ల భాషా ఆధిపత్యం తెలుగు వంటి స్థానిక భాషలను క్రమంగా కుదించేస్తోంది. ఈ సంక్షోభ సమయంలో తెలుగు సమాజంలో యువతరం సాహిత్య సజనా ఆలోచనలను ఉత్తేజపరచి, తెలుగు సాహిత్యంలో అకాడమిక్‌ నైపుణ్యాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యం. ఇందుకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండవ తెలుగు సాహిత్య మహాసభ 2026 జరగనుంది. AI ప్రభావ కాలంలో సాహిత్యం, సామాజిక-సాంస్కతిక మార్పులపై ప్యానల్‌ చర్చలు, డిస్కషన్లు యువకులకు నూతన దిశానిర్దేశం చేస్తాయి.
– హాథిరాం సబావత్‌

భిన్న అస్తిత్వాల నుంచి సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెడుతున్న యువ కవులను, రచయితలను ఆహ్వానించి మాట్లాడించడం ద్వారా భిన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కతిక అంశాలు సాహిత్యరంగాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో, ప్రతిస్పందనగా సాహిత్యం ఆయా రంగాలనూ ఎలా ప్రభావితం చేస్తుందో అవగాహన పొందుటకు ఈ ”రెండవ తెలుగు సాహిత్య మహాసభ” మంచి వేదిక అనుకుంటున్నాను. సాహిత్యం మనిషిని ”మనీషి”గా పరివర్తన చెందిస్తుంది, అట్లాంటి ఉన్నత మానవీయ విలువల ఆవిష్కరణలో భాగంగా ఈ సభలు యువకవులను గుణాత్మక ప్రగతిశీల ప్రభావానికి గురిచేస్తాయని ఆతతగా ఎదురు చూస్తున్నాను.
– విను

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర ఎంతో ఘనమైనది. అయినప్పటికీ రాయబడని, వినబడని గొంతుకలు.వేల సంవత్సరాల తర్వాత అక్షరాన్ని అందుకొని ఏదో ఒక సాహితీ రూపంలో రాసుకున్న, రాసుకుంటున్న తమ జీవితాల గురించి చర్చించుకోవాలిసిన అవసరం ఎంతైనా ఉంది. నిర్లక్ష్యానికీ గురైన వారి పనిపాటలను,ముందు తరాల అనుభవాలను తెలుసుకొని పరస్పరం చర్చించుకొని, భవిష్యత్తుని గుర్తుంచుకొని పరిపూర్ణంగా అక్షరబద్దం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అట్లాంటి ఒక సందర్భాన్ని రెండవ తెలుగు లిటరరీ కాంగ్రెస్‌- 2026 చేపట్టడం ఆనందంగా ఉంది.అయితే ఇప్పుడిప్పుడే సాహిత్య మేడిపట్టిన యువతకు ఈసారి అవకాశం ఇచ్చి, సాహిత్య సాళ్ళను సుసంపన్నం చేయిస్తున్నందుకు మరీ సంతోషంగా ఉంది.
– చిక్కొండ్ర రవి

ఈ సారి తెలుగు లిటరరీ కాంగ్రెసు -2026 విలువైన అంశాలను చర్చకు పెట్టింది . పెద్ద మొత్తంలో యువ సాహితీకారులను భాగం చేయడం దీని ప్రత్యేకత. యువ కవుల ఆలోచనలు, ముందు తరం కవుల నుండి వారు పొందిన స్ఫుర్తిని, కథా, కవిత్వనిర్మాణ రహస్యాలను పంచుకోవడానికి మనముందుకు వస్తున్నారు. సమాజ, సాహిత్య సంబంధాలు, డిజిటల్‌ యుగంలో సాహిత్యం మొదలైన విలువైన సెషన్స్‌ పెట్టి మాట్లాడించడం చాలా సంతోషం. ఆరుబయట ఆర్ట్స్‌ కాలేజి ముందు కవిత్వం చదివించడం కవిత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకపోవడమే.
– తగుళ్ళ గోపాల్‌

సాహిత్యాన్ని కాచి కాపాడాల్సిన బాధ్యత అందరిదీ. మంచి చేయాల్సిన బాధ్యతనూ, చెడును నిర్మూలించాల్సిన ఆవశ్యకతనూ సాహిత్యం ఏకకాలంలో అందుకుంటుంది. అటువంటి సాహిత్య మరింత మేలైన రీతిలో సాగాలంటే అందరూ ఒకచోట చేరి సమాలోచన జరపాలి. ఏం రాస్తున్నా, ఏం రాయాలి, ఏం రాయకూడదనే అవగాహన రావాలి. అందుకు దోహదపడే కార్యక్రమం ఈ ‘యూత్‌ లిటరరీ కాంగ్రెస్‌ 2026’. కొత్త రచయితలు ఏం రాస్తున్నారో, సాహిత్యంలో వస్తున్న నూతనరీతులేమిటో, మార్చుకోవాల్సిన విషయాలు, చేర్చుకోవాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఏటా జరగడం అవసరం.
– వి. సాయివంశీ

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకెళ్తున్న సమయంలో యువ రచయితల సాహిత్యం సమకాలీన సమాజానికి ఒక అద్దం వంటిది. యువత తమ భావోద్వేగాలను, మూలాలను స్పాంటనియస్‌ గా సాహిత్యంలోకి తీసికొస్తున్న నేపథ్యంలో తెలుగు లిటరరీ కాంగ్రెస్‌ యువ సాహిత్యానికి నూతనోత్తేజాన్ని ఇచ్చే వేదిక. అనేక చర్చలతో మరింత బాధ్యతయుతంగా తయారు చేసే మంచి ప్రయత్నం.
– పేర్ల రాము

– డా. చంద్రయ్య శివన్న
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, నిజాం కళాశాల

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -