Monday, April 6, 2026
E-PAPER
Homeదర్వాజసాహితీ సమాచారం

సాహితీ సమాచారం

- Advertisement -

‘చెట్టు కూలుతున్న చప్పుడు’ పుస్తకావిష్కరణ
కొండి మల్లారెడ్డి కవిత్వం ‘చెట్టు కూలుతున్న చప్పుడు’ ఏప్రిల్‌ 17న సాయంత్రం 6 గంటలకు సిద్దిపేట ప్రెస్‌ క్లబ్‌లో జరుగును. వక్తలుగా కవి యాకూబ్‌, బూర్ల వెంకటేశ్వర్లు, పర్కపెల్లి యాదగిరి, గఫూర్‌ శిక్షక్‌ పాల్గొంటారు.
– తెలంగాణ రచయితల వేదిక

డా||వాసా ప్రభావతి స్మారక కథలపోటీ

వాసాఫౌండేషన్‌ సాహితీకిరణం సంయుక్త ఆధ్వర్యంలో డా||వాసా ప్రభావతి స్మారక కథలపోటీ నిర్వహిస్తున్నది. కథలు కుటుంబవ్యవస్థకి సంబంధించినదై, కుల, మత, వర్గ ప్రశస్తి లేని కథలను నాలుగుపేజీలకు మించకుండా ఏప్రిల్‌ 30 లోపు పంపాలి. చిరునామా: సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌నెం.3, హైదరాబాద్‌-500102. సెల్‌:9490751681.
పొత్తూరి సుబ్బారావు, సంపాదకులు

శ్రీ ఊహకు డా||వి.చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారం
డాక్టర్‌ వి.చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారం 2026 సంవత్సరానికి యువ కథారచయిత్రి శ్రీ ఊహకు 12 ఏప్రిల్‌ సాయంత్రం 5.30 నిమిషాలకు విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కాన్ఫరెన్స్‌ హాలు నందు ప్రదానం చేస్తారు. ఈ సభలో డాక్టర్‌ వి.ప్రసూన, కాట్రగడ్డ దయానంద్‌, పి. సత్యవతి, డాక్టర్‌ బి.తిరుపతిరావు, మహమ్మద్‌ ఖదీర్‌ బాబు, వాసిరెడ్డి నవీన్‌ పాల్గొంటారు.
– డాక్టర్‌ వి.ప్రసూన

‘చుండూరు శేషారత్నం కవితా పురస్కారం 2026’ ఫలితాలు
తెలుగు సాహితీ వనం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చుండూరు శేషారత్నం కవితా పురస్కారం-2026’ ఫలితాలు : నాగ జ్యోతి శేఖర్‌ కవితా సంపుటి ‘చిగురించే పేజీలు’, బి కళా గోపాల్‌ కవితా సంపుటి ‘నేను సత్యవతిని’. తెలుగు సాహితీవనం 9వ వార్షికోత్సవం జూలైలో హైదరాబాద్‌లో జరుగుతుంది.
– శాంతి కృష్ణ, తెలుగు సాహితీవనం వ్యవస్థాపక అధ్యక్షులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -