వంకతాడు ఆవిష్కరణ
తెలంగాణ సాహితీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తండ హరీష్ గౌడ్ రచించిన ‘వంకతాడు’ తెలంగాణ గౌడ తొలి దీర్ఘకవిత ఆవిష్కరణ ఈ నెల 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది.
తోట నిర్మలారాణికి ఉదారి నాగదాసు స్మారక పురస్కారం
ప్రముఖ తత్త్వ కవి ఉదారి నాగదాసు స్మారక పురస్కారాన్ని 2025 సంవత్సరానికి గాను ప్రముఖ కవయిత్రి తోటనిర్మలారాణిగారికి అవార్డు కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీ ఆదిలాబాద్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరుతుంది. ఈ అవార్డు కింద ఐదు వేయిల రూపాయల నగదు, ప్రశంసా పత్రం అందజేస్తారు.
– డా. ఉదారి నారాయణ, 9441413666.
కవితాసంకలనంలో ప్రచురణలకు ఆహ్వానం
మీ కవితలకు, మీ స్వరానికి, ఒక అందమైన వేదిక దర్పణం సాహిత్య వేదిక. మిత్రుల కోరిక మేరకు పరస్పర సహకార పద్ధతిలో మరో కొత్త కవితాసంకలనాన్ని విడుదల చేయబోతున్నాం. పాల్గొనదలచిన వారు ఈ ప్రత్యేక వాట్సాప్ సమూహంలో చేరండి: https://chat.whatsapp.com. యూట్యూబ్ లో కవితా వేదిక కవితాసంకలన ప్రచురణలో పాల్గొనేవారికి అదనపు అవకాశం. మీ పరిచయంతో పాటు మీ స్వరంలో మీ కవితలు దర్పణం సాహిత్య వేదిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం చేస్తాం. ఇది కవితాసంకలన ప్రచురణలో పాల్గొనేవారికి మాత్రమే పరిమితం. వివరాలకు: 9912957347
-డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, అధ్యక్షులు, దర్పణం సాహిత్య వేదిక
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -