ప్రకాశ కిరాణాలు ఆవిష్కరణ
పొత్తూరి సుబ్బారావు రచించిన ‘ప్రకాశకిరణాలు’ సంపాదకీయాల సంపుటి ఈనెల 6న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభ కళాసుబ్బారావు కళావేదికలో జరుగుతుంది. డా||కె.వి.రమణాచారి, డా||పి.విజయబాబు, కళా వి.ఎస్.జనార్దనమూర్తి, డా||వంశీ రామరాజు, బ్కెస దేవదాసు, మౌనశ్రీ మల్లిక్, పెద్దూరి వెంకటదాసు, పొత్తూరి జయలక్ష్మి పాల్గొంటారు. ఈ పుస్తకాన్ని కవి, రచయిత వి.యస్.వి.ప్రసాద్‌కి అంకితం కావిస్తారు.
వి.వి.రాఘవరెడ్డి, జి.వి.ఆర్.ఆరాధన కల్చరల్ ఫౌండేషన్
రెండుతరాల కవిసంగమం సిరీస్ -45
ఈ నెల 8న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, బషీర్ బాగ్‌లోని నిజాం కాలేజిలో రెండు తరాల కవిసంగమం సిరీస్ 45 జరుగుతుంది. పాల్గొంటున్న కవులు:చెమన్, గట్టు రాధికమోహన్, తలారి సతీష్ కుమార్, జాదవ్ అంబదాస్, నితిన్ చౌహాన్ (నిజాం కాలేజి బి. ఏ విద్యార్థి )
కవిసంగమం
రక్తదానం ఆవశ్యకతపై కవితలకు ఆహ్వానం
రక్తదాన ఆవశ్యకతపై అవగాహన, ప్రేరణ కలిగించే అంశాలతో అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థ కవితలను ఆహ్వానిస్తున్నాం. ఎంపిక చేయబడిన కవితలతో సంకలనం ప్రచురిస్తారు. 25 లైన్లకు మించని కవితలను వర్డ్, పిడిఎఫ్ రూపంలో నవంబర్ 30 లోపు [email protected] మెయిల్‌కు, 98492 61210 నెంబర్‌కు వాట్సాప్‌లో పంపాలి.
డా|| పి విజయ్ చందర్ రెడ్డి
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -


