Sunday, November 23, 2025
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

ధీరజ్‌కోట్ల పురస్కారాలు
ప్రముఖ సాహితీ విశ్లేషకులు యన్‌. రవి శేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన 2025వ సంవత్సరపు ధీరజ్‌కోట్ల పురస్కారాల ఎంపికలో ఎమ్బీఎస్‌ ప్రసాద్‌ రచించిన ‘వశీకరణం’ కథా సంపుటికి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతులకి పాలగిరి విశ్వప్రసాద్‌, స్వరాజ్య పద్మజ కుందుర్తి, మునిసురేష్‌ పిళ్లె, దేశరాజు, బి.మురళీధర్‌, వెల్చేరు చంద్రశేఖర్‌, గొర్తి వాణి శ్రీనివాస్‌ కథా సంపుటాలు ఎంపికయ్యాయి. విశిష్ట పురస్కారానికి టిఎస్‌ఏ కృష్ణమూర్తి, యువ రచయిత పురస్కారానికి దొండపాటి కృష్ణ, బాల సాహిత్య పురస్కారానికి వాసుకి నూచెర్ల, ఆత్మీయ పురస్కారానికి కేతు పద్మమ్మ ఎంపికయ్యారు. -పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి

అందెశ్రీ సంస్మరణ సభ
జాతీయ సంగీత కళాకారుల సంఘం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అందెశ్రీ సంస్మరణ సభ ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరుగుతుంది. ఈ సభలో డా||ఏనుగు నరసింహారెడ్డి, డా||కె.శ్రీనివాస్‌, డా||ఎం.ప్రభాకర్‌, డా||నాళేశ్వరం శంకరం, సిద్ధార్థ, మౌనశ్రీ మల్లిక్‌, డా||రాపోలు సుదర్శన్‌ పాల్గొంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -