‘భూపతి చంద్ర’ మెమోరియల్ ట్రస్ట్ కథానిక పురస్కారాలు-2025
మే 18వ తేదీ ఆదివారం సాయంత్రం 5-30 గంటలకు హైదరాబాద్, తెలంగాణ సారస్వత పరిషత్తు, డా? దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ఈ సభ జరుగనుంది. ఎమ్.ఎల్.కాంతారావు గారి అధ్యక్షతన జరిగే ఈ సభలో సీనియర్ సంపాదకులు కె.రామచంద్ర మూర్తి, ముఖ్య అతిథిగా, ప్రొ.మన్నవ సత్యనారాయణ, బి.నర్సింగ రావు అతిథులుగా పాల్గొంటారు. చాగంటి ప్రసాద్ ‘తీరని ఋణం’, ఉప్పలూరి మధుపత్ర శైలజ ‘అనుకోని అతిథి’, కొండి మల్లారెడ్డి ‘కర్రె కోడి’ కథలు ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమానాలకు ఎంపిక కాగా, ఎం. శ్రీనివాసరావు ‘సమిధ’, గొర్తివాణి శ్రీనివాస్ ‘వెన్నెల రాగం’, కామరాజుగడ్డ వాసవదత్త రమణ ‘సాగనీ పయనం’, ఎస్. గంగాలక్ష్మి ‘శారద విజయం’, పప్పు శాంతాదేవి ‘ఏది ముఖ్యం?’ కథలు ప్రోత్సాహక పురస్కారాలు అందుకుంటారు .సభా నిర్వహణ సి.ఎస్.రాంబాబు – ఎమ్.ఎల్.కాంతారావు
జీవజలం చలం సాహిత్య స్మారకోపన్యాస సభ
మే 18, 2025 ఆదివారం సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాలులో చలం సాహిత్య స్మారకోపన్యాస సభ జరుగుతుంది. ఈ సభలో కె. ఎన్. మల్లీశ్వరి, నెల్లుట్ల రమాదేవి, మామిడి హరికష్ణ, డా. సలీమా, డా. లక్ష్మీ అసిరెడ్డి, డా. దాసోజు పద్మావతి, డా. శ్రీ భాష్యం అనురాధ, నస్రీన్ ఖాన్‌లు పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం. – నాకళేశ్వరం శంకరం
జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు – 2025
వురిమళ్ల ఫౌండేషన్, అక్షరాల తోవ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు – 2025 నిర్వహిస్తున్నారు. వురిమళ్ల శ్రీరాములు స్మారక కథల పోటీకి చేతిరాతతో 5 పేజీలకు మించకుండా కథను, వురిమళ్ల పద్మజ స్మారక కవితల పోటీకి 25 లైన్లకు మించని కవితలను ఏదైనా సామాజికాంశంమీద రాసి మే 15 లోపు భోగోజు ఉపేందర్‌రావు, ఇం.నెం. 11-10-694/5, బురహాన్‌పురం, ఖమ్మం – 507001 చిరునామాకు పంపాలి. వివరాలకు : 9494773969.
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -