అఫ్సర్‌కి సిటీ కాలేజ్ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కారం
సిటీ కాలేజ్ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కార (2026)ప్రదాన సభ ప్రభుత్వ సిటీ కళాశాల (హైదరాబాద్) గ్రేట్ హాల్లో జనవరి 27 ఉదయం 10 .30 గం.కు జరుగుతుంది. అఫ్సర్ పురస్కారం స్వీకరిస్తారు. ఈ సభకు విప్లవ్ దత్ శుక్ల, గోరటి వెంకన్న, కవి యాకూబ్, వేణు ఊడుగుల, కె. ఆనందాచారి, శ్రీమతి పి .శాంతి, కోయి కోటేశ్వరరావు, జె నీరజ అతిథులుగా హాజరవుతారు. -సిటీ కాలేజ్ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ అవార్డు కమిటి
‘శర్వమ్మ మరణం’ ఆవిష్కరణ సభ
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో చందన పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో వాసరచెట్ల జయంతి కథా సంపుటి ‘శర్వమ్మ మరణం’ ఆవిష్కరణ సభ 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. ఈ సభలో డా|| నందిని సిద్ధారెడ్డి, డా|| ఏనుగు నరసింహారెడ్డి, డా|| నాళేశ్వరం శంకరం, డా|| నామోజు బాలాచారి, డా||తంగెళ్ళ శ్రీదేవి, డా|| నర్రా ప్రవీణ్ రెడ్డి, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, వాసరచెట్ల జయంతి, వి.జి.చందన పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం. – ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
‘అహానికి ఆవల’ పరిచయ సభ
జి. ఉమామహేశ్వర్ రచించిన కథల సంపుటి ‘అహానికి ఆవల’ పరిచయ సభ 1 ఫిబ్రవరి ఉదయం 10.30 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. సభకు దాసరి అమరేంద్ర, కె.పి. అశోక్ కుమార్, మారుతి పౌరోహితం, శ్రీఊహ పాల్గొంటారు. -పాలపిట్ట బుక్స్



