Thursday, October 9, 2025
E-PAPER
Homeసినిమా'చిట్టి చిలకా.. చిన్న మొలకా..'

‘చిట్టి చిలకా.. చిన్న మొలకా..’

- Advertisement -

రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్‌ జాతర’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్‌’, ‘ఓలే ఓలే’ పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాజాగా చిత్ర బృందం మూడవ గీతంగా ‘హుడియో హుడియో’ అనే సరికొత్త మెలోడీని ప్రేక్షకులకు అందించింది. ‘మాస్‌, మెలోడీని అందంగా మిళితం చేసిన ఈ ట్యూన్‌ అందరినీ కట్టిపడేస్తోంది. రెండు ఉత్సాహభరితమైన పాటలతో అందరినీ కాలు కదిపేలా చేసిన తర్వాత, ఇప్పుడు శ్రోతల హదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునే ఓ మంచి మెలోడీతో వచ్చారు. మునుపటి మాస్‌ మహారాజా రవితేజను తిరిగి తీసుకొని వస్తున్నట్టుగా మాస్‌-క్లాస్‌ కలిసిన ఆరా ఇందులో కనిపిస్తోంది. ఇక శ్రీలీల మరోసారి తెరపై వెలుగులు వెదజల్లారు. రవితేజ-శ్రీలీల ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ, ఈ అందమైన గీతానికి మరింత అందాన్ని తీసుకొని వచ్చింది.

ఈ గీతాన్ని సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో హుషారుగా ఉండేలా తనదైన శైలిలో అద్భుతంగా స్వరపరిచారు. దీనికి తోడు సంగీత సంచలనం హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ తన మనోహరమైన స్వరంతో భీమ్స్‌తో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. దేవ్‌ రచించిన సాహిత్యం అందర్నీ అలరిస్తోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపుఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్‌ విందుని అందించడానికి ఈనెల 31న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -