Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'లిటిల్‌ హార్ట్స్‌' రిలీజ్‌కి రెడీ

‘లిటిల్‌ హార్ట్స్‌’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

”నైన్టీస్‌ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ ఫేమ్‌ మౌళి తనుజ్‌, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ శివానీ నాగరం లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న మూవీ ‘లిటిల్‌ హార్ట్స్‌’.
ఈ చిత్రాన్ని ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై దర్శకుడు సాయి మార్తాండ్‌ రూపొందించారు. డైరెక్టర్‌ ఆదిత్య హాసన్‌ నిర్మాత. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్‌, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 5న థియేట్రికల్‌ విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘చదువూ లేదు’ లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాటను క్యాచీ ట్యూన్‌తో సింజిత్‌ యెర్రమల్లి కంపోజ్‌ చేశారు. స్వరూప్‌ గోలి లిరిక్స్‌ అందించగా, ‘మళ్లీశ్వరివే..’ సాంగ్‌ ఫేమ్‌ జెస్సీ గిఫ్ట్‌ పాడారు. ‘చదువూ లేదు సంధ్యా లేదు, అయినా సూడు సిగ్గే రాదు, పైకే లెవెలూ చూశావ బ్రదరూ, లేదే ఫియరూ, ఏంటీ తీరు, ఎంపీసీ రాదంటా, బైపీసీ భయమంటా, చాతేమీ కాదంటా అయ్యో శుంఠా..’ అంటూ సాగుతుందీ పాట. సగటు మేడిన్‌ తెలుగు స్టూడెంట్‌ ఎలా ఉంటాడో ఈ పాటలో చూపించారు. ఇటీవలే రిలీజ్‌ చేసిన ఈ సినిమా టీజర్‌కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. థియేటర్స్‌లోనూ ఇదే ఆదరణ దక్కుతుందని టీమ్‌ నమ్మకంతో ఉంది.
మౌళి తనూజ్‌, శివానీ నాగరం, రాజీవ్‌ కనకాల, ఎస్‌ ఎస్‌ కాంచి, అనిత చౌదరి, సత్య కష్ణన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – సాయి మార్తండ్‌, మ్యూజిక్‌ – సింజిత్‌ యెర్రమల్లి, సినిమాటోగ్రఫీ – సూర్య బాలాజీ, ఎడిటర్‌ – శ్రీధర్‌ సొంపల్లి, ఆర్ట్‌ డైరెక్టర్‌ – దివ్య పవన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ – వినోద్‌ నాగుల, మురళి పున్న.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad