• జిల్లా పశు వైద్యాధికారి కిరణ్ కుమార్
• సర్పంచ్ తండాలో పశువైద్య శిబిరం తనిఖీ
నవతెలంగాణ – పెద్దవంగర
పశుసంపదను పాడి రైతులు కాపాడుకోవాలని జిల్లా పశు వైద్యాధికారి కిరణ్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని సర్పంచ్ తండాలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మండల పశు వైద్యాధికారి రాజశేఖర్ తో కలిసి మాట్లాడారు. పాడి రైతులు పశు సంపదపై దృష్టిసారించి, ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. పశుసంపద మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకవంటిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత టీకా కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 14 వరకు గాలికుంటు వ్యాధికి టీకాలు వేస్తారని, తప్పనిసరిగా పశువులకు టీకాలు వేయించాలన్నారు. పశువులకు సీజనల్ వ్యాధులు సోకకుండా, ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశుపాకల పరిశుభ్రత, దూడలలో నట్టల నివారణ వంటి విషయాలపై పశు పోషకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది సంధ్య, అనిల్, హాసన్, పాడి రైతులు నెహ్రూ నాయక్, దేవా, బోజ్య, సోమాని, రవి తదితరులు పాల్గొన్నారు.
పశుసంపదను కాపాడుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



