Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు గాలి కుంటు టీకాలు వేయించాలి

పశువులకు గాలి కుంటు టీకాలు వేయించాలి

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
మండలంలోని ప్రతి రైతు తమ పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయించాలని పెళ్ళంట పశు వైద్యాధికారి శ్యాంసుందర్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కుప్పగండ్ల, బైరాపూర్ గ్రామాలలో పశువైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. పశువులకు సీజనల్ గా వచ్చే వ్యాధుల పట్ల ప్రభుత్వం అందజేసే టీకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది నరేష్ రెడ్డి, నరసింహ, ఫణిందర్ రెడ్డి, శ్రీను, తిరుపతయ్య, గోపాలమిత్రలు బాలు, మొగులయ్య, సాయిబాబా, విజేందర్ రైతులు విష్ణు,భరత్, చెన్నయ్య గౌడ్, రవి, రవీందర్ రెడ్డి, నారయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -