Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి 

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి 

- Advertisement -

డాక్టర్ శివరాజ్
నవతెలంగాణ – మిడ్జిల్
గ్రామాలలో ఉన్న అన్ని గేదలకు, ఆవులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలని పశువైద్య  డాక్టర్ శివరాజ్ అన్నారు. బుధవారం మండలంలోని కొత్తపల్లి, వాడ్యాల్, మల్లాపూర్ గ్రామంలో గాలికుంటు వ్యాధి టీకాలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రైతులందరూ కూడా తమ పశువులకు గాలికుంటు వ్యాధి తప్పనిసరిగా వేయించాలని సూచించారు. గాలికుంటు వ్యాధి సోకితే టీకాలు వేయించుకుంటే చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. రైతులందరూ కూడా తమ మూగజీవాలను జాగ్రత్తగా చూసుకోవాలని సీజన్లో వచ్చే వ్యాధులపై రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గాలికుంటు వ్యాధి టీకాలను విజయవంతం చేయడానికి సిబ్బంది రైతులు ప్రజలు సహకరించాలని కోరారు. మూడు గ్రామాలలో 80 మూగజీవాలకు టీకాలు వేయించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది నరసింహులు, శ్రీనివాసులు,గోపాల మిత్రులు యాదగిరి, రామకృష్ణ, నరసింహులు, మల్లేష్, వేణుగోపాలు, మల్లయ్య, వివిధ గ్రామాల చెందిన రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -