Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముదక్ పల్లిలో పశువులకు గాలి కుంట టీకాలు

ముదక్ పల్లిలో పశువులకు గాలి కుంట టీకాలు

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్ 
శనివారం రోజున మోపాల్ మండలంలోని ముదక్ పల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాలికుంటు టీకాల నిర్వాహణ కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్  రోహిత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా గాలికుంట వ్యాధి రహిత జిల్లాగా మార్చాలని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ టీకాలు వేయడం జరుగుతుందని ,ఈ టీకాలు పశువులకు వేయడం వల్ల పశువులకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.

దానితోపాటు పాల దిగుబడి కూడా ఎక్కువ అవుతుందని దీనివల్ల రైతులకు ఎంతో మేలు అవుతుందని, ఈ పాలక అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుందని ఆయన తెలిపారు. అందుకే మా సిబ్బంది ప్రతి గ్రామానికి వచ్చి టీకాలు వేస్తారని ఎవరైనా తమ పశువులకు వేయించుకొని వారు ఉంటే తమ సిబ్బందికి తెలియజేసి పశువులకు టీకాలు వేసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే మన నిజామాబాద్ జిల్లా మొత్తంలో 1,80,000 పశువులు ఉంటే దాదాపు 75 వేలకు పైబడి పశువులకు టీకాలు వేయడం జరిగిందని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ శిరీష, సురేష్, బాబు, గోపాలమిత్రాలు రాజశేఖర్,

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -