- Advertisement -
చీకటిని చీల్చుకుంటూ ఉషోదయం
మెడపై కాడితో పరుగులు తీసే
రైతన్న కాళ్ళు.
విత్తనం విత్తినప్పుడు పుట్టిన ఆకాంక్ష
ఎండకు వాడిపోతుంటే
పచ్చదనం కోసం కళ్లల్లో వెతుకులాట
ఎరువుల బస్తా కోసం వేచి చూస్తూ
రైతు కళ్ల నిండా నిరీక్షణ.
యూరియా కోసం నిలిచిన
ఉంగటం లేని చెప్పుల బారులు
సెల్ఫీలు దిగే నేటి యువతకు
తెలియని కథను చెబుతున్నాయి
ప్రతీ ఉదయం కొత్త ఆశ,
ప్రతి సాయంత్రం నిరాశ
అయినా,
భూమిని నమ్మిన అతని గుండెలో
మొలకెత్తిన మొక్క లా దాగున్న ఒక కోరిక.
హైటెక్ నగరాల్లో కంప్యూటర్ తెరలపై
పచ్చదనాన్ని వెతుకుతున్న ప్రపంచం అన్నదాత కలలు చెదిరిపోతున్న
దశ్యాన్ని పట్టించుకోవడం లేదు.
చలనం లేని మట్టిమనిషి కళ్లలో
సహనం కోల్పోయిన ఆపేక్ష
నిర్జీవంగా ఉన్న భూమిని
సజీవంగా చూడాలన్న కల
- విల్సన్‌రావు కొమ్మవరపు, 8985435515
- Advertisement -