Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుస్కూల్ బస్సు కిందపడి ఎల్.కే.జి విద్యార్థిని మృతి

స్కూల్ బస్సు కిందపడి ఎల్.కే.జి విద్యార్థిని మృతి

- Advertisement -

నల్లగొండ పట్టణంలోని మాస్టర్ మైండ్ పాఠశాలలో ఘటన
ఘటన బాధాకరం: జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి 
పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా..
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు:  నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి..
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి 

ప్రయివేటు స్కూల్ బస్సు కిందపడి ఎల్ కే జి విద్యార్థిని మృత్యువాత పడిన సంఘటన గురువారం నల్లగొండ పట్టణంలోని మాస్టర్ మైండ్ పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాల యాజమాన్యం, డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ చిన్నారి తను చాలించింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కనగల్లు మండలం తొరగల్లు గ్రామా నికి చెందిన చింతపల్లి రాధిక సైదు లు దంపతుల కుమార్తె చింతపల్లి జశ్విత (5) నల్లగొండ పట్టణంలోని మాస్టర్ మైండ్ పాఠశాలలో ఎల్ కే జీ చదువుతోoది. గత వారం రోజులుగా జశ్వితకు తీవ్ర జ్వరం రాగా పాఠశాలకు హాజరు కాలేదు.

జ్వరం తగ్గడంతో గురువారం జశ్విత తల్లి రాధిక జశ్వితను యధావిధిగా గ్రామానికి వస్తున్న మాస్టర్ మైండ్ పాఠశాలకు చెందిన బస్సులో పంపించింది. విద్యార్థులతో పట్టణంలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలకు చేరుకున్న బస్సులోని విద్యార్థులు అంత బస్సు దిగి తరగతి గది వైపు వెళ్లారు. చివరగా వెళ్లిన జశ్విత బస్సు ముందు నుంచి వెళ్తుండగా నిర్లక్ష్యంగా ముందు చూపు లేకుండా డ్రైవర్ బస్సును కదపడంతో చక్రాల కింద పడడంతో, తలపై నుంచి టైరు ఎక్కింది. దీంతో జశ్విత అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే  ఘటన స్థలా నికి చేరుకొని జస్విత మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి లోనీ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యు లకు, బంధువులకు విషయం తెలియడంతో మార్చురీకి చేరుకొని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. కుటుంబ సభ్యుల రోధనలతో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణం మారుమోగింది. 

ఘటన బాధాకరం: జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి

నల్లగొండ పట్టణంలోని మాస్టర్ మైండ్ పాఠశాలలో ఎల్ కే జీ చదువుతున్న. జశ్విత బస్సు కింద పడి మృత్యువాత పడిన సంఘటన తెలుసుకున్న జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి గురువారం మార్చురీలో మృతదేహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్కూలు బస్సు డ్రైవర్ పాఠశాల ని ర్లక్ష్యంతోనే విద్యార్థిని మృతి చెంది నట్లు తెలిసిందన్నారు. పాఠశాలల ప్రారంభంలోనే అన్ని పాఠశాలల యాజమాన్యాలకు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఇలాంటి ఘట నలు జరగడం బాధాకరమన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవ హరించిన వారి పై కేసులు నమోదు: నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

జశ్విత కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని నిర్లక్ష్యంగా వ్యవ హరించిన వారి పై కేసులు నమోదు చేస్తామన్నారు.

పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా..

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న మా స్టర్ మైండ్స్ పాఠశాల నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆరోపిస్తూ డివైఎఫ్ఐ  ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ ఆధ్వర్యంలో వేరు వేరుగా ధర్నా నిర్వహించి మృతి చెందిన విద్యార్థిని తల్లిదండ్రులకు ఆవేదనను అర్థం చేసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు, ఆర్టీవో అ ధికారులు పాఠశాల బస్సులు పాఠశాలల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్య వహరిస్తుండడంతో పాటు పర్యవేక్ష ణ లోపంతో ఇలాంటి ఘటనలు చో టు చేసుకుంటున్నాయని ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad