- Advertisement -
ఎఐ లీడ్‌గా శిరీష్ తాటికొండ నియామకం
హైదరాబాద్ : లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ హైదరాబాద్‌లో శిరీష్ తాటికొండను కొత్త ఎఐ లీడ్‌గా నియమించింది. తద్వారా ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 200 పైగా నిపుణులతో తమ నాయకత్వాన్ని బలోపేతం చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్, టార్గెట్ కార్పొరేషన్, ఐబిఎం రీసెర్చ్‌లలో శిరీష్‌కు 20 ఏండ్లకు పైగా ఎఐ, మెషిన్ లెర్నింగ్ అనుభవాన్ని కలిగి ఉన్నారని ఆ సంస్థ సీఈఓ శిరీష వోరుగంటి పేర్కొన్నారు. శిరీష్ నియామకం తమ వృద్ధి, వినూత్న ఏఐ అప్లికేషన్‌ల అభివృద్ధిలో కీలక ముందడుగు కానుందన్నారు.
- Advertisement -