Friday, January 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచేనేత కార్మికులకు రుణమాఫీ చేయండి

చేనేత కార్మికులకు రుణమాఫీ చేయండి

- Advertisement -

శైలజా రామయ్యార్‌కు చేనేత సంఘం వినతి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని తెలంగాణ చేనేత కార్మికుల సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్‌ కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో హ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్‌, హ్యాడ్‌క్రాప్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చేనేత కార్మికుల సమస్యలను ఆమె ముందు ప్రస్తావించారు. బ్యాంకర్లతో మాట్లాడామనీ, వడ్డీ మాఫీ చేస్తామని తెలిపారని శైలజారామయ్యార్‌ హామీనిచ్చారు. రుమాఫీకి కావలిసిన పదిహేను కోట్ల రూపాయలకు సీఎం ఆమోదం లభించిందనీ, త్వరలోనే ఆర్థిక శాఖ అనుమతి వస్తుందనీ, వారంలో రుణమాఫీ అయిపోతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -