Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రుణాలు అందించాలి

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రుణాలు అందించాలి

- Advertisement -

– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఇందిరమ్మ ఇండ్లను వేగవంతం చేసేందుకు ఆర్థిక అవసరాలు ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్ లో ఐకేపి సీసీ లతో సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఆర్థిక అవసరాలు ఉన్న లబ్ధిదారుల జాబితాను ఐకెపి సిబ్బందికి ఎంపీడీవో అందజేశారు. గ్రామాల వారిగా ఇందిరమ్మ లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి ఆర్థిక అవసరమున్న లబ్ధిదారులకు వారి వారి అవసరం మేరకు రూ.రెండు లక్షల వరకు రుణాలు అందించాలని ఐకెపి సిబ్బందికి సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రుణాలు అందించడంలో ఇలాంటి అలసత్వాన్ని ప్రదర్శించోద్దని, ఇందిరమ్మ ఇండ్లను వేగవంతం చేసేందుకు తక్షణమే రుణాలు అందించాలన్నారు.ఈ సమావేశంలో సీసీలు భాగ్య, లకావత్ పీర్య, రవి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -